Neeraj Chopra: తన రికార్డును తానే బద్దలు కొట్టుకున్న ఒలింపిక్ స్టార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా (24) తన రికార్డునే తానే బద్దలుకొట్టుకున్నాడు. ఫిన్‌లాండ్‌లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో 89.30 మీటర్ల దూరంలో జావెలిన్ త్రో వేసి రికార్డు సృష్టించాడు. దీంతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును బద్దలుకొట్టుకున్నాడు. నీరజ్ చోప్రా గత ఏడాది మార్చిలో పాటియాలలో 88.07 మీటర్లు విసిరాడు. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేశాడు. అంతేకాకుండా 2021, ఆగస్టు 7న టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్ల దూరం విసిరి బంగారు పతకం గెల్చుకున్నాడు. ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్‌కు తొలి స్వర్ణం అందించిన అథ్లెట్‌గా చరిత్రలో నిలిచాడు.
టోక్యో ఒలింపిక్స్ తర్వాత దాదాపు 10 నెలల పాటు నీరజ్ చోప్రా విశ్రాంతి తీసుకున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఫిన్‌లాండ్‌లో జరుగుతున్న పావో నుర్మీ గేమ్స్ బరిలోకి దిగాడు. ఈ పోటీల్లో తొలి ప్రయత్నంలో 86.92 మీటర్లు విసిరిన నీరజ్ చోప్రా.. రెండో ప్రయత్నంలో 89.30 మీటర్లు విసిరాడు. ఆ తర్వాత మూడు ప్రయత్నాలు విఫలం కాగా చివరి ప్రయత్నంలో 85.85కే పరిమితమయ్యాడు. కాగా జావెలిన్ త్రో విభాగంలో ఫిన్‌లాండ్‌కు చెందిన ఓలీవర్ హీలేండర్ 89.83 మీటర్లతో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
Also Read
- Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
- Abhishek Sharma: టీ20ల్లో అభిషేక్ శర్మ చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా..
- India vs Japan: ఓడిపోతాం అనుకున్నా.. అతడే గట్టెక్కించాడు.. శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు!
- Shafali Verma: ఆ బ్యాటింగ్ ఏంది స్వామీ.. క్రీజులోకి దిగితే పరుగుల వరదే.. లేడీ సెహ్వాగ్ విశ్వరూపం!
ENG Vs NZ: బెయిర్‌స్టో టీ20 బ్యాటింగ్.. రెండో టెస్టు కూడా ఇంగ్లండ్‌దే
తాజావార్తలు
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
-
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
-
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!