Bhumana Karunakar Reddy: ఆనాటి టీడీపీ ప్రభుత్వం వైసీపీ నేతల ఫోన్‌లను ట్యాప్ చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ హయాంలో పెగాసస్ సాఫ్ట్‌వేర్ వాడిన అంశంపై వరుసగా రెండోరోజు హౌస్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పెగాసస్‌పై నియమించిన హౌస్ కమిటీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల సమాచారాన్ని అప్రజాస్వామికంగా తస్కరించిందన్నారు. ఈ అంశంపై నిన్న, ఇవాళ సంబంధిత శాఖల అధికారులతో ప్రాథమికంగా చర్చించినట్లు తెలిపారు. తమకు కావాల్సిన సమాచారాన్ని అడిగామని.. వచ్చే సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. జూలై 5న మరోసారి హౌస్ కమిటీ సమావేశమవుతుందని చెప్పారు.
పెగాసస్ వ్యవహారంపై మూడు నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సభ ముందు పెడతామని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం డేటా చౌర్యం విషయంలో అనేక దొంగ పనులు చేసిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పామన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పిన అంశాలు కూడా కమిటీ పరిగణనలోకి తీసుకుంటుందని వివరించారు.
Also Read
- OTR: ఏపీలో పదే పదే రిక్రూట్మెంట్ జీవోల విషయంలో తడబాట్లు..
- Saikrishna Case Update: సాయికృష్ణ లాకప్ డెత్ కేసు.. కీలక వివరాలను వెల్లడించిన సిట్..
- UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
- SIPB: విశాఖపట్నంలో ఉపాధి అవకాశాలు.. దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపీబీ గ్రీన్ సిగ్నల్..
అప్పటి టీడీపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ప్రైవేట్ ఏజెన్సీల నుంచి సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేసిందని భూమన విమర్శలు చేశారు. వ్యక్తుల వ్యక్తిగత గోప్యత, అప్రజాస్వామికంగా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేశారన్నారు. కమిటీ కేవలం పెగాసస్ అంశానికి మాత్రమే పరిమితం కాదని.. అవసరమైతే అప్పుడు నిఘా విభాగంలో పని చేసిన అధికారులను పిలిపిస్తామని తెలిపారు. దోషులను ప్రజల ముందు నిలబెడతామన్నారు. ఆనాడు టీడీపీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేశారని శాసన సభ నమ్మిందని.. కమిటీ కూడా ఈ అంశాన్ని నమ్ముతోందని భూమన అన్నారు.
తాజావార్తలు
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
-
Saudi-Europe: యూరప్‌కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
-
Macron: యూరప్‌లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..