Maharashtra: ఔరంగాబాద్ ఎంపీ ఆవేదన.. పేరు మార్చడం కోసం రూ.వెయ్యి కోట్లు తగలేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటీవల మహారాష్ట్రలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం దిగిపోయేముందు ఔరంగాబాద్ పేరును శంభాజీ నగర్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో అన్ని డాక్యుమెంట్లలో, బోర్డుల మీద ఔరంగాబాద్ పేరును మార్చాల్సి ఉంటుంది. తాజాగా ఈ అంశంపై ఔరంగాబాద్ ఎంపీ, AIMIM పార్టీ నేత ఇంతియాజ్ జలీల్ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చివరి ప్రయత్నంగా థాక్రే సర్కారు ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. సాధారణంగా చిన్న పట్టణానికి పేరు మార్చడం కోసం రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని ఇటీవల ఓ నివేదిక చదివి తెలుసుకున్నానని.. ఔరంగాబాద్ వంటి పట్టణానికి అయితే పేరు మార్పు కోసం రూ.1,000 కోట్లు ఖర్చు అవుతుందని ఢిల్లీ అధికారి చెప్పారని ఇంతియాజ్ జలీల్ వ్యాఖ్యానించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
Read Also: ICC WTC: ఆసీస్‌పై విజయంతో భారత్ స్థానానికి ఎసరు పెట్టిన శ్రీలంక
Also Read
ఊరి పేరు మార్చడం వల్ల ప్రభుత్వ డాక్యుమెంట్లు, ఉత్తర, ప్రత్యుత్తరాల పేరు మార్పు కోసం రూ.వెయ్యి కోట్లను ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ఇదంతా ప్రజల పన్నుల ద్వారా వచ్చిన ఆదాయంతోనే ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. ఇందులో తన డబ్బు కూడా ఉంటుందన్నారు. అటు కొత్త పేరు వల్ల ప్రజలు ఇక్కట్లకు గురవుతారని ఎంపీ ఇంతియాజ్ జలీల్ అభిప్రాయపడ్డారు. ఇది మతానికి సంబంధించిన ఆవేదన కాదన్నారు. ఉదాహరణకు తనకు ఓ షాపు ఉంటే ఇప్పుడు పేరు మార్పుతో షాపుకు సంబంధించిన డాక్యుమెంట్ కూడా మార్చుకోవాల్సి ఉంటుందన్నారు. దీని కోసం కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని… ఇందుకోసం ఎవరికి వారే క్యూలో నిలబడాల్సి ఉంటుందన్నారు. ఉద్ధవ్ థాక్రే లేదా శరద్ పవార్ లేదా మరో నేత వచ్చి ప్రజలకు సాయం చేయరన్నారు. సామాన్య ప్రజలకు ఈ ప్రక్రియ ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆలోచించాలన్నారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!