Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం సాధించాలనే కల దాదాపు ప్రతి ఐటీ, నాన్-ఐటీ నిపుణుడికీ ఉంటుంది. కానీ, కేవలం మంచి రెజ్యూమె ఉంటే సరిపోదు. అద్భుతమైన స్కిల్స్, డిగ్రీలు ఉన్నప్పటికీ సరైన విధానం తెలియక చాలామంది సెలక్షన్ ప్రాసెస్‌లో వెనుకబడిపోతుంటారు. సరిగ్గా ఈ సమస్యకే గూగుల్ సీనియర్ టెక్నికల్ రిక్రూటర్ బెన్ మీడ్ ఒక అద్భుతమైన గైడ్ ఇచ్చారు. గూగుల్‌లో జాబ్ కొట్టాలంటే రెజ్యూమె తయారీ నుంచి ఇంటర్వ్యూ వరకు ఎలాంటి మెలకువలు పాటించాలో ఆయన కొన్ని కీలక టిప్స్ షేర్ చేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
మొదటిగా అభ్యర్థులు తమ అనుభవం, ప్రాజెక్ట్‌లను వివరంగా వివరిస్తూ 3 నుంచి 4 పేజీల సమగ్రమైన ‘మాస్టర్ రెజ్యూమె’ను సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత, మనం దరఖాస్తు చేయాలనుకుంటున్న జాబ్ డిస్క్రిప్షన్‌ను గూగుల్ జెమిని ఏఐ (Gemini AI) టూల్లో ఉంచి, దానికి తగ్గట్టుగా రెజ్యూమెను కస్టమైజ్ చేసుకోవడం చాలా స్మార్ట్ పద్ధతి అని ఆయన సూచించారు. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే.. తమ ప్రొఫైల్‌తో సంబంధం లేకుండా కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తుంటారు. అలా కాకుండా, ఒకేసారి పది పోస్టులకు దరఖాస్తు చేయడం కంటే.. మీ అనుభవానికి సరిగ్గా సరిపోయే 2 లేదా 3 రోల్స్ పైనే పూర్తి దృష్టి పెట్టాలని రిక్రూటర్ స్పష్టం చేశారు.
Also Read
- 200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
- Vivo Y600: 10,000mAh బ్యాటరీతో Vivo Y600 లాంచ్.. 120Hz AMOLED డిస్ప్లే, MediaTek ప్రాసెసర్‌తో అద్భుతమైన ఫీచర్స్!
- Amazon Sale: దీపావళి క్లీనింగ్ భయం అక్కర్లేదు.. రూ. 3వేల లోపే లభిస్తున్న బెస్ట్ 2-ఇన్-1 వాక్యూమ్ క్లీనర్ మీకోసం..
- ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
ఇక ఇంటర్వ్యూ విషయానికి వస్తే, బిహేవియరల్ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ‘STAR’ మెథడ్ ఉపయోగించడం చాలా ముఖ్యం. అంటే ఎస్ (S) అంటే సమస్య లేదా పరిస్థితి ఏంటి? టీ (T) అంటే అందులో మీ బాధ్యత ఏమిటి? ఏ (A) అంటే ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు తీసుకున్న చర్యలు? ఆర్ (R) అంటే దానివల్ల వచ్చిన ఫలితం ఏమిటి? ఈ పద్ధతిలో సమాధానాలు చెబితే రిక్రూటర్లపై మంచి ప్రభావం పడుతుందని వివరించారు. ఇంటర్వ్యూలో కేవలం సరైన సమాధానం చెప్పడం మాత్రమే ముఖ్యం కాదు. ఇచ్చిన సమస్యను మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఎలా పరిష్కరిస్తున్నారనేదే అసలు పరీక్ష. ఒకవేళ ప్రశ్న క్లిష్టంగా ఉంటే, ముందుగా దానికి సంబంధించిన మీ సందేహాలను ఇంటర్వ్యూయర్‌ను అడిగి నివృత్తి చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఆలోచనా విధానాన్ని ఒక్కొక్కటిగా వివరిస్తూ పోవాలి. దీనివల్ల మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బయటపడతాయని చెబుతున్నారు.
చివరిగా, గూగుల్‌లో పనిచేయడానికి టీమ్‌వర్క్ చాలా కీలకం. తోటి ఉద్యోగులతో కలిసి ఎలా పనిచేస్తారు, క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ముఖ్యం. యూజర్ల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, సవాళ్లను ఎదుర్కొని టీమ్‌తో కలిసి సమస్యను పరిష్కరించిన నిజ జీవిత ఉదాహరణలను ఇంటర్వ్యూలో పంచుకోవాలి. మీ ఈ ప్రయత్నాల వల్ల సంస్థకు, టీమ్‌కు ఎలాంటి ప్రయోజనం చేకూరిందో వివరించగలిగితే గూగుల్‌లో కొలువు సాధించడం సులభమవుతుందని సీనియర్ టెక్నికల్ రిక్రూటర్ బెన్ మీడ్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆ కేసులో నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
-
Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
ట్రెండింగ్
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!