What’s Today:
* ఢిల్లీ: పింగళి వెంకయ్య గౌరవార్ధం ఇందిరా గాంధీ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘తిరంగ ఉత్సవ్’ కార్యక్రమం.. ముఖ్య అతిథులుగా హాజరుకానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, అర్జున్ రామ్ మేఘవాల్, మీనాక్షి లేఖి
* నేడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు.. ఆజాదీ కా మహోత్సవ్‌లో భాగంగా వేడుకలు.. ఈరోజు తాడేపల్లిలో వేడుకలను ప్రారంభించనున్న సీఎం జగన్
* తిరుమల: ఇవాళ గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీవారు
* తిరుమల: ఇవాళ ఉదయం 10 గంటలకు ఆన్ లైన్‌లో ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ
* కోనసీమ: నేడు రామచంద్రపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ
* పల్నాడు జిల్లా: నేడు అమరావతి మండలం జూపూడిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనున్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరావు
* తెలంగాణలో నేటి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర.. యాదాద్రి నుండి భద్రకాళి దేవాలయం వరకు సాగనున్న యాత్ర
* ములుగు: లాయర్ మల్లారెడ్డి హత్యను ఖండించిన వరంగల్ బార్ అసోసియేషన్.. నేడు విధుల బహిష్కరణకు పిలుపునిచ్చిన న్యాయవాదులు
* సెయింట్ కిట్స్: నేడు భారత్-వెస్టిండీస్ మధ్య మూడో టీ20.. రాత్రి 8 గంటలకు మ్యాచ్