Sonali Phogat: హిందీ బిగ్‌బాస్ కంటెస్టెంట్, కంటెంట్ క్రియేటర్ సోనాలి ఫోగట్ (42) గుండెపోటుతో సోమవారం రాత్రి గోవాలో మరణించారు. టిక్‌టాక్ వీడియోలతో సోనాలి ఫోగట్ పెద్దఎత్తున అభిమానులను సంపాదించుకున్నారు. 2020లో బిగ్‌బాస్ రియాల్టీ షోలో పాల్గొన్నారు. 2006లో పాపులర్ హిందీ టీవీ యాంకర్‌గానూ గుర్తింపు పొందారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సోనాలీ ఫోగట్‌కు 8.8 లక్షల మంది ఫాలోవర్లున్నారు. అటు రాజకీయాల్లోనూ సోనాలి ఫోగట్ రాణిస్తున్నారు. 2019 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి […]
YSRCP: గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం అదనపు సమన్వయకర్తగా ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ను వైసీపీ అధిష్టానం నియమించడంతో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వర్గీయులు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవితో కలిసి ఏకంగా జిల్లా అధ్యక్షురాలు మేకతోటి సుచరిత ఇంటివద్ద ఆందోళనకు దిగారు. డొక్కా గో బ్యాక్ అంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ నినాదాలు చేశారు. కానీ రెండు రోజుల్లో నేతలు సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. నిన్నటివరకూ డొక్కాకు అదనపు సమన్వయకర్త పదవి రద్దు చెయ్యాలని అధిష్టానాన్ని డిమాండ్ […]
God Father Teaser: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా గాడ్ ఫాదర్ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. దీంతో మెగా అభిమానులందరూ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఇంతలోనే గాడ్ ఫాదర్ మూవీ సంగీత దర్శకుడు తమన్‌ను సోషల్ మీడియాలో నెటిజన్‌లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ బీజీఎం అచ్చం వరుణ్ తేజ్ ‘గని’ టైటిల్ సాంగ్‌లా ఉందని కొందరు నెటిజన్‌లు వీడియోలు షేర్ చేస్తున్నారు. గని టైటిల్ సాంగ్ మ్యూజిక్‌ను తమన్ మక్కీకి మక్కీ […]
Team India Coach Rahul Dravid Tested Covid Positive:ప్రతిష్టాత్మక ఆసియా కప్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. రేపో.. మాపో టీమిండియా యూఏఈకి బయలుదేరాల్సి ఉండగా.. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో రాహుల్ ద్రవిడ్ ఐదురోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో టీమిండియా యూఏఈకి ఆలస్యంగా వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసియాకప్ టోర్నీకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్న వేళ కోచ్ ద్రవిడ్‌కు కరోనా […]
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈనెల 29న అమరావతిలోని సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరగనుంది. ఈనెల 29న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అవుతుందని సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. అయితే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా ప్రతిపాదనలు పంపించాలని వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు […]
Mobile Prices: మొబైల్ కొనుగోలు చేయాలనుకునేవాళ్లకు చేదువార్త అందింది. దేశవ్యాప్తంగా త్వరలోనే మొబైల్ ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. మొబైల్ డిస్‌ప్లేకు అనుసంధానించే స్పీకర్లు, సిమ్ ట్రేలు, పవర్ కీల దిగుమతులపై 15% సుంకం విధిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్& కస్టమ్స్(CBIC) ప్రకటించింది. ఈ భారాన్ని ఆయా కంపెనీలు వినియోగదారులపైనే మోపే అవకాశం ఉంది. ఇదే జరిగితే స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయి. చాలా కంపెనీలు ఇండియాలోనే స్మార్ట్‌ఫోన్లను తయారు చేస్తున్నప్పటికీ విడిభాగాలను మాత్రం […]
Shikar Dhawan: జింబాబ్వేతో మూడో వన్డేలో శార్దూల్ ఠాకూర్ జెర్సీతో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బ్యాటింగ్ చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు 42వ నంబర్ జెర్సీ ధరించాల్సిన ధావన్ 54వ నంబర్ జెర్సీ ధరించాడు. అయితే జెర్సీపై శార్దూల్ ఠాకూర్ పేరు కనపడకుండా టేప్ అతికించారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఓపెనర్‌గా శార్దూల్ వచ్చాడేమో అని అనుకున్నామని కొందరు నెటిజన్‌లు కామెంట్ చేశారు. ప్రపంచంలోనే ధనిక […]
Andhra Pradesh Weather: వర్షాకాలంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల వర్షాలు దంచికొట్టగా ప్రస్తుతం ఆ బాధ్యతను భానుడు అందుకున్నాడు. దీంతో ఏపీలో వర్షాకాలంలో ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. మరికొన్ని రోజులు ఎండల తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. గత 24 […]
Schools Bandh: ఏపీ, తెలంగాణలో నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు స్కూళ్లు, కాలేజీలు బంద్ చేయాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పెండింగ్‌లో ఉన్న వసతి, విద్యాదీవెన బకాయిలు విడుదల చేయాలని, మెస్ ఛార్జీలు పెంచాలని, పుస్తకాలు, యూనిఫామ్‌లు ఇవ్వాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము పిలుపునిచ్చిన బంద్‌ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాలలో పీడీఎస్‌యూ, ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు బంద్ చేపట్టనున్నారు. Read […]
What’s Today Updates: • నేడు కృష్ణా నది యాజమాన్య బోర్డు కమిటీల సమావేశం.. వరద నీటి వినియోగంపై చర్చించనున్న కమిటీలు • హైదరాబాద్: నేడు చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ • గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ • కర్నూలు: నేడు ఎస్టీబీసీ కళాశాలలో జాబ్ మేళా • తూర్పుగోదావరి: నేడు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్.. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని […]