IND Vs SA: ఇండోర్‌లో టీమిండియాతో జరుగుతున్న నామమాత్రపు టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు రెచ్చిపోయారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్ డికాక్ మరోసారి రాణించాడు. అతడు 43 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 68 పరుగులు చేశాడు. రోసౌ సెంచరీతో చెలరేగాడు. 48 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులతో తుదికంటా నాటౌట్‌గా నిలిచాడు. స్టబ్స్ 23, మిల్లర్ 19 పరుగులు చేసి రోసౌకు సహకరించారు. భారత బౌలర్లందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్, చాహర్ చెరో వికెట్ తీశారు.
Read Also: లూసిఫర్ Vs గాడ్ ఫాదర్.. అక్కడెవరు.. ఇక్కడెవరు
కాగా ఈ మ్యాచ్‌లో గెలవాలంటే భారత్ 228 పరుగులు చేయాలి. ఇప్పటికే 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడుతుంది అన్న విషయం ఆసక్తికరంగా మారింది. ఓపెనర్లుగా రోహిత్, పంత్ బరిలోకి దిగనున్నారు. సూర్యకుమార్ ఫామ్ కొనసాగిస్తాడో లేదో వేచి చూడాలి. కాగా టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా మేనేజ్‌మెంట్ సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చింది. వీరి స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఉమేష్ యాదవ్‌లకు చోటు కల్పించింది. అటు యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా పక్కనబెట్టి అతడి స్థానంలో మహ్మద్ సిరాజ్‌ను తీసుకుంది.