మోహన్ లాల్ నటించిన ‘లూసిఫర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఈ సినిమా మల్లూవుడ్ బాక్సాఫీస్ హిట్ టీ నిలిచింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు చిరంజీవి. ఇదిలా ఉంటే ‘లూసిఫర్’ తర్వాత మరోసారి కలసి సినిమా చేస్తున్నారు మోహన్ లాల్, పృథ్వీరాజ్. ‘బ్రో డాడీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. 44 రోజుల పాటు ఏకధాటిగా జరిపిన షెడ్యూల్స్ తో సినిమాను పూర్తి […]
(సెప్టెంబర్ 7న మమ్ముట్టికి 70 ఏళ్ళు పూర్తి) మళయాళ చిత్రసీమలో ప్రేమ్ నజీర్ తరువాత సూపర్ స్టార్ స్థానం ఖాళీ అయింది. ఆ సమయంలో ప్రేమనజీర్ తరం వారు భలేగా పోటీపడ్డారు. కానీ, వారి తరువాత వచ్చిన మమ్ముట్టి ఆ స్థానం ఆక్రమించారు. తనదైన అభినయంతో మమ్ముట్టి అనేక మళయాళ చిత్రాలను విజయతీరాలకు చేర్చారు. తక్కువ పెట్టుబడితోనే చూపరులను కట్టిపడేసేలా చిత్రీకరించడంలో మళయాళ దర్శకులు ఆరితేరినవారు అని ప్రతీతి. మమ్ముట్టి చిత్రాలను మన బడ్జెట్ తో పోల్చి […]
‘డర్టీ హరి’ మూవీతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు నిర్మాత, దర్శకుడు ఎం. ఎస్. రాజు. తాజాగా ఆయన ‘7 డేస్ 6 నైట్స్’ మూవీని తెరకెక్కిస్తున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనూ అన్ని జాగ్రత్తలూ తీసుకుని వందమంది టీమ్ తో నాలుగు కెమెరాలతో గోవా, మంగళూరు, ఉడిపిలో షూటింగ్ పూర్తి చేశారు. ఇప్పటికే డబ్బింగ్ సైతం కంప్లీట్ అయిన ఈ సినిమా రీ-రికార్డింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ మూవీతో 16 సంవత్సరాల సమర్థ్ గొల్లపూడి సంగీత […]
విశాల్ నటించిన ‘ఎనిమీ’ సినిమా దసరా విడుదలకు సిద్ధం అవుతోంది. ఆర్య విలన్ గా నటించిన ఈ సినిమా ‘టీజర్’తోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్ గ్రాండియర్ గా రూపొందిన ఈ సినిమా కోసం కోలీవుడ్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తమన్ స్వరపరిచిన పాటలు కూడా విడుదలై ఆకట్టుకుంటున్నాయి. దసరాకు తెలుగు, తమిళ భాషల్లో సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ ప్రకటిస్తూ రిలీజ్ చేసిన పోస్టర్‌లో […]
ఆరేళ్ళ క్రితం సహజ నటి జయసుధ, నిర్మాత నితిన్ కపూర్ తనయుడు శ్రేయాన్ హీరోగా టాలీవుడ్ లోకి ‘బస్తీ’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా పరాజయం పాలైంది. దాంతో అతను నటనకు గుడ్ బై చెప్పేశాడు. అయితే అదే సమయంలో జయసుధ మరో కుమారుడు నిహార్ కపూర్ ను చూసిన వాళ్ళు… అతనితో విలన్ పాత్రలు చేయిస్తే బాగుంటుందనే సలహా ఇచ్చారు. ఆరు అడుగుల తొమ్మిది అంగుళాల ఎత్తు ఉండే నిహార్ కపూర్ ఇప్పుడు […]
నటి సమీరా రెడ్డి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పక్కరలేదు. చేసినవి మూడు, నాలుగు సినిమాలే అయినా గుర్తుండిపోయే సినిమాలే చేసింది. ఆ సినిమాలు కూడా స్టార్ హీరోలతోనే కావటం విశేషం.. టాలీవుడ్ లో స్టార్ హోదా లభించే టైమ్ లోనే సమీరా బాలీవుడ్ బాట పట్టింది. ఆపై పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఇద్దరు పిల్లలు వున్నా ఆమె బరువు పెరిగిందనే విమర్శలు ఆమధ్య రావడంతో స్లిమ్ గా మరి అందరిని ఆశ్చర్యపరిచింది. మళ్ళీ సినిమాలోకి ఎంట్రీ […]
అఖిల్ అక్కినేని నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అక్టోబర్ 8 న విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు దర్శకనిర్మాతలు. రిలీజ్ డేట్ తో పోస్టర్ రిలీజ్ చేసిన యూనిట్ అందులో ఏ గెటప్స్ లో ఉన్న అఖిల్‌ను చూపించారు. ఇప్పటి వరకూ హిట్ లేని అఖిల్ ఈ సారి ఆ కోరిక తీర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే అఖిల్ […]
టొక్యో పారాలింపిక్స్ విజేతలకు టాలీవుడ్ సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లు ఇప్పటికే విజేతల ప్రతిభను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేయగా.. తాజాగా నందమూరి బాలకృష్ణ ‘ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు అని నిరూపించిన మీ అందరిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను’ అంటూ అభినందనలు తెలియచేశారు. ‘ టొక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్క భారత క్రీడాకారులకు, విజేతలకు నా అభినందనలు, అంగవైకల్యాన్ని అధిగమించి తమ ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో […]
అమెరికా ప్రముఖ టెలివిజన్ షో దివైర్ సిరీస్ నటుడు మైఖేల్ కె విలియమ్స్ (54) మృతి చెందారు. రెండు రోజులుగా ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో.. ఆయన స్నేహితుడు ఆపార్ట్ మెంట్ కు వెళ్లి చూసే సరికి మైఖేల్ శవంగా కనిపించాడు. ఆయన పక్కన డ్రగ్స్ విపరీతంగా ఉండటంతో ఆకారణంగానే చనిపోయి ఉంటాడని అధికారులు నిర్దారణకు వస్తున్నారు. డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్లే మృతి చెందినట్లు భావిస్తున్నారు. మైఖేల్ స్నేహితుడు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. […]
(సెప్టెంబర్ 7న ‘అఫ్సానా’కు 70 ఏళ్ళు పూర్తి) దేశం గర్వించదగ్గ దర్శకనిర్మాత బి.ఆర్.చోప్రా. ఆయన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘అఫ్సానా’. ప్రముఖ నటుడు అశోక్ కుమార్ ద్విపాత్రాభినయంతో రూపొందిన ‘అఫ్సానా’ 1951 సెప్టెంబర్ 7న విడుదలయింది. ఈ చిత్రానికి ఐ.ఎస్.జోహార్ కథ, మాటలు సమకూర్చారు. షదీలాల్ హండాతో కలసి బి.ఆర్.చోప్రా ఈ సినిమాను నిర్మించారు. త్రిభువన్ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది. ‘అఫ్సానా’ సినిమా కథ చదువుతున్నట్టుగానే చిత్రీకరించారు. టైటిల్ కార్డ్స్ సమయంలోనే ఓ […]