అంగవైకల్యం.. ఆత్మవిశ్వాసం.. ఆశాజ్యోతులు.. అంటూ బాలయ్య అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టొక్యో పారాలింపిక్స్ విజేతలకు టాలీవుడ్ సినీప్రముఖులు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ లు ఇప్పటికే విజేతల ప్రతిభను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేయగా.. తాజాగా నందమూరి బాలకృష్ణ ‘ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు అని నిరూపించిన మీ అందరిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను’ అంటూ అభినందనలు తెలియచేశారు.
‘ టొక్యో పారాలింపిక్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్క భారత క్రీడాకారులకు, విజేతలకు నా అభినందనలు, అంగవైకల్యాన్ని అధిగమించి తమ ప్రతిభ, పట్టుదల, ఆత్మవిశ్వాసాలతో పతకాలను గెలవటమే కాకుండా కొత్త రికార్డ్స్ కుడా సృష్టించారు, మీరు కేవలం క్రీడాకారులే కాదు, అంగవైకల్యాన్ని శాపంగా భావించి బాధపడే వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ఆశాజ్యోతులు… ప్రతిభకు అంగవైకల్యం అడ్డుకాదు అని నిరూపించిన మీ అందరిని చూసి నేను చాలా గర్వపడుతున్నాను, మీరు ఇంకా ఎన్నో అద్భుతాలు సృష్టించాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ బాలయ్య సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.
Also Read

తాజావార్తలు
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్‌కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!