బుల్లితెర నటుడు, బిగ్‌బాస్ సీజన్ 4 కన్సిస్టెంట్ అవినాష్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల అనుజ అనే అమ్మాయితో అవినాష్ నిశ్చితార్థం జరిగింది. గుట్టు చప్పుడుగా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను తాజాగా అవినాష్ విడుదల చేశాడు. ‘జత కలిసే’ అంటూ నిశ్చితార్థం వీడియోను సోషల్ మీడియా వేదికగా అవినాష్ అభిమానులతో పంచుకున్నాడు. ‘మన జీవితంలోకి రైట్ పర్సన్ వచ్చినప్పుడు ఏ మాత్రం […]
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఊహించని పరిణామాలతో హాట్ హాట్ గా మారుతున్నాయి. ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని బండ్ల గణేశ్ స్పష్టం చేయడమే కాకుండా.. ప్రకాశ్ రాజ్ ప్యానల్‌లో జీవితా రాజశేఖర్ రాకను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఆమెకు పోటీగా జనరల్ సెక్రటరీగా పోటీ చేసి గెలుస్తానని సవాలు విసిరారు. ఇప్పటివరకూ ప్రకాశ్ రాజ్‌కు మద్దతిస్తూ ప్యానల్ సభ్యుడిగా ఉన్న బండ్ల గణేశ్ యూటర్న్ తీసుకోవడంతో మా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. […]
అఫ్గానిస్థాన్ లో చోటు చేసుకుంటున్న తాజా పరిస్థితులను సమీక్షించేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నతస్ధాయి సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘన్ లో ప్రభుత్వం ఏర్పాటుకు తాలిబన్లు పూర్తిగా సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలోనే మోడీ ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. గతవారం కూడా భారత పౌరులను స్వదేశానికి తీసుకువచ్చే ఆపరేషన్ సందర్భంలోనూ మోడీ సమీక్ష నిర్వహించారు. తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్థాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పౌరులపై ఆంక్షలు, విభేదించిన వారిపై కఠిన […]
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా దోచుకోవాలనే ధ్యాసే కానీ ప్రజల బాగు కోసం ఆలోచన లేదని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గజ్వెల్ లో బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడాతూ.. ‘ రాబోయే ఎన్నికల్లో ఏనుగుకు గుర్తుకు , కారు గుర్తుకు మధ్య పోటీ జరగబోతుందన్నారు. నేను ఉన్న, చచ్చినా కాన్షిరామ్, మాయావతి ఆశీస్సులతో నీలి రంగు కండువాలోనే […]
ఆది పినిశెట్టి అథ్లెట్ గా నటిస్తున్న ‘క్లాప్’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన స్నేహితుడైన రవిరాజా పినిశెట్టి తనయుడు ఆది నటించిన ద్విభాషా చిత్రం ‘క్లాప్’ టీజర రిలీజ్ చేయటం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు చిరంజీవి. బహుభాషా నటుడైన ఆదిని తమ కుటుంబ సభ్యునిగా భావిస్తామని, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు ఏవీ నిరాశపరలేదని అలాగే ఆది నటించిన […]
చిరంజీవి సోమవారం గోపీచంద్ మూవీ ‘సీటీమార్’ ట్రైలర్ చూసి, దర్శకుడు సంపత్ నందితో పాటు చిత్ర బృందాన్ని అభినందించారు. ఈ నెల 10వ తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమాను చూసి, ప్రేక్షకులు స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. ఆ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగానే, యంగ్ హీరో ఆది పినిశెట్టి ‘క్లాప్’ మూవీ టీజర్ ను సైతం చిరంజీవి విడుదల చేసి, యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. అథ్లెటిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన ‘క్లాప్’ విజయం కావాలని […]
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తల్లి అరుణా భాటియా తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆసుపత్రిలో చేరారు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను ముంబయిలోని హీరానంది ఆసుపత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి కాస్త విషమంగానే ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అయితే తల్లి అనారోగ్యంపై సమాచారం అందిన వెంటనే అక్షయ్ కుమార్ హుటాహుటీన లండన్ నుంచి బయలుదేరి ముంబయి చేరుకున్నారు. రాత్రి ముంబై ఎయిరోపోర్టుకు చేరుకున్న అక్షయ్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల అక్షయ్ షూటింగ్ కోసం […]
బాలీవుడ్ ప్రేక్షకులు మెచ్చిన ‘అంధదూన్’ సినిమాకి తెలుగు రీమేక్ గా ‘మాస్ట్రో’ వస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 17వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. కథానాయికగా నభా నటేశ్ నటించగా, కీలకమైన పాత్రలో తమన్నా కనిపించనుంది. ఇప్పటికే విడుదల ట్రైలర్ లో నితిన్ అంధుడిగా అదరగొట్టగా.. తాజాగా ఈ సినిమా నుంచి మరో లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ‘లా […]
అభిమానానికి హద్దులు ఉండవు. తాము అభిమానించేవారి పేర్లను, బొమ్మలను తమ శరీరంపై పచ్చబొట్లుగా వేయించుకొని మురిసిపోవడమూ కొందరికి ఆనందం ఇస్తుంది. నటసింహ నందమూరి బాలకృష్ణ వీరాభిమాని కార్తిక్ కూడా అలా ఆనందంలో ఓలలాడుతున్నాడు. హైదరాబాద్ కు చెందిన కార్తిక్ ఎమ్.బి.ఏ. చదివాడు. ఎంచక్కా తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే మదిలో కొలువైన అభిమాన హీరో నందమూరి బాలకృష్ణ బొమ్మను ట్యాటూగా తన జబ్బపై వేయించుకుని ఆనందించాడు కార్తిక్. ఇందులో విశేషమేముంది? అలా ఎంతోమంది ఫ్యాన్స్ చేస్తున్నారు […]
తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 ఆరంభం అయింది. వరుసగా మూడవసారి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ 5వ సీజన్ లో మొత్తం 19 మంది పోటీదారులు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది బిగ్ బాస్ 5 ముందు పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఎదురు చూస్తున్నాయి. గత సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా అంతగా పరిచయం లేని ముఖాలే ఎక్కువగా […]