తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. చదువుకున్నోళ్ళందరికీ సర్కార్ ఉద్యోగం రాదని.. హమాలీ పని చేసుకోవాలని సూచించారు. అయితే తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘నా కామెంట్స్ తప్పుగా అన్వయించారని తెలిపారు. యువత మనోభావాలను దెబ్బతీసేలా నేను ఎప్పుడూ మాట్లాడలేదు, యువత ఎవరు బాధ పడవద్దన్నారు. చదువుకున్న నిరుద్యోగ యువత ప్రిపేర్ అవ్వండి.. నోటిఫికేషన్లు రాబోతున్నాయి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఏపీ-తెలంగాణ జల వివాదంపై మాట్లాడుతూ.. కేంద్రం […]
దశాబ్దాలుగా తెలుగు, తమిళ చిత్రాల్లో తన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయంలో స్థానం సంపాదించుకున్నారు సుహసిని. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు సుహసిని అంటే ప్రత్యేక అభిమానం. వాళ్ల అభిమానాన్ని కాపాడుకునేలా గొప్ప క్యారెక్టర్స్ చేస్తూ ఆకట్టుకుంటున్నారామె. గతంలో ఎన్టీయార్ – కృష్ణవంశీ ‘రాఖీ’ చిత్రంలో ఆమె పోషించిన పోలీస్ ఆఫీసర్ పాత్రకు ఎంత పేరొచ్చిందో అందరికీ తెలిసిందే. ‘ఇప్పుడు అలాంటి పవర్ ఫుల్ పాత్రను ‘బలమెవ్వడు’ చిత్రంలో పోషిస్తున్నార’ని ఆ చిత్ర దర్శకుడు సత్య రాచకొండ […]
నేడు యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ పుట్టిన రోజు. తన బాబాయి సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) అడుగుజాడల్లో నడుస్తూ, తెలుగు చిత్రసీమలో తనకూ, తమ బ్యానర్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ కూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చారు నాగవంశీ. బర్త్ డే వేడుకులకు దూరంగా ఉండే నాగవంశీ సైలెంట్ గా తన పనిలో తాను నిమగ్నమైపోయారు. సూర్యదేవర రాధాకృష్ణ హారిక అండ్ హాసిని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో ప్రతిష్ఠాత్మక చిత్రాలను […]
నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి! కామెడీ చిత్రాల హీరో నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారినా, రాజేంద్రుడి వినోదపు జల్లుకు ఫుల్ స్టాప్ పడలేదు. దానికి తాజా ఉదాహరణ ఆ మధ్య వచ్చిన ‘గాలి సంపత్’ చిత్రం. అందులోనూ ఒక కంట పన్నీరు మరో కంట కన్నీరు ఒలికించారు రాజేంద్ర ప్రసాద్. జూలై 19 నటకిరీటి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ ను దర్శక నిర్మాతలు […]
ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామికి విలువైన కానుక అందచేశారు. ఈ రోజు ఉదయం ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల విలువైన సూర్య కటారి బంగారు ఆభరణంను శ్రీనివాస ప్రసాద్ తో కలిసి స్వామివారికి అందించారు దాసరి కిరణ్ కుమార్. గతంలో పలు చిత్రాలను నిర్మించిన దాసరి కిరణ్ త్వరలోనే వరుసగా సినిమాలను రూపొందించటానికి సన్నాహాలు చేస్తున్నారు.
మాజీమంత్రి ఈటల రాజేందర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణను కేసీఆర్ రజాకార్ల రాజ్యం చేసిండన్నారు.. ‘దళిత బందు పథకం’ పెట్టారట సంతోషం.. కానీ ఇంతవరకు దళితులకు ఇస్తామన్న 3 ఎకరాలు అమలు కాలేదని, వారి సంక్షేమ కోసం ఏమీ చెయ్యలేదని ఆరోపించారు. కేవలం ఎన్నికల కోసం పథకాలు తీసుకురావద్దు.. రెండేళ్లుగా ఇవ్వని పెన్షన్, రేషన్ కార్డ్ ఇస్తున్నారు. […]
అల్లుడు ధనుష్ మామ రజనీకాంత్ ని కూడా దాటేశాడు! అంతే కాదు, కమల్ హాసన్, విజయ్, సూర్య… కోలీవుడ్లో మరే స్టార్ కూడా ధనుష్ తో పోటీ పడలేకపోతున్నాడు! ట్విట్టర్ లో మన టాలెంటెడ్ యాక్టర్ దూకుడు అలా ఉంది మరి! తమిళంతో మొదలు పెట్టి బాలీవుడ్, హాలీవుడ్ దాకా విస్తరిస్తోన్న ధనుష్ సొషల్ మీడియాని కూడా వదలటం లేదు. ట్విట్టర్ లో ఆయన తాజాగా 10 మిలియన్ ఫాలోయర్స్ మార్కుని దాటాడు. ఇంత భారీగా అనుచరులు […]
నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నాడని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. నీళ్లు చేతులారా వదులుతున్నాడు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నాడు.. నిధులు ఎలాగో లేవు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసాడని ఆరోపించాడు. రంగారెడ్డికే కాదు.. పశ్చిమ తెలంగాణకి చుక్క నీరు రానివ్వకుండా చేసాడు. రాష్ట్రానికి దరిద్రం పట్టుకోవడం కాదు…కేసీఆర్ కుటుంబం పట్టుకుందని విమర్శలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో హుజూరాబాద్‌లో కేసీఆర్‌ని ఓడిస్తామని తేల్చి చెప్పారు. ఇందుకోసం అన్ని పార్టీల నాయకుల […]