‘సాహో’తో తెలుగు వారికి పరిచయమైన బబ్లీ ‘బ్యాడ్ గాళ్’ జాక్విలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు కన్నడలో కాలుమోపింది. రీసెంట్ గా ఆమె బెంగుళూరులో ఓ పాటకి స్టెప్పులేసింది. అయితే, ఈసారి ‘సాహో’లో మాదిరిగా స్పెషల్ సాంగ్ కే పరిమితం కాలేదు బాలీవుడ్ బ్యూటీ. తొలిసారి సౌత్ మూవీలో ఓ స్పెషల్ క్యారెక్టర్ చేసింది. కిచ్చా సుధీప్ హీరోగా తెరకెక్కుతోన్న ‘విక్రాంత్ రోనా’ సినిమాలో ఆమె కీలక పాత్రలో అలరించబోతోంది… అక్షయ్ కుమార్ లాంటి హీరో సహా పలువురు బీ-టౌన్ […]
ముంబై మహానగరానికి వరుసగా సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశం మొత్తంలోనే అత్యధిక కరోనా కేసులు అక్కడే వచ్చాయి. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ రెండూ ముంబైనే టార్గెట్ చేశాయి. ఆ ఎఫెక్ట్ విపరీతంగా పడింది బాలీవుడ్ మీద! రెండు సంవత్సరాలుగా బీ-టౌన్ పదే పదే చతికిలపడుతోంది. అయితే, రీసెంట్ గా లాక్ డౌన్ ఎత్తేశాక మాత్రం బాలీవుడ్ బడా స్టార్స్ అందరూ ఒకేసారి బరిలోకి దిగారు. చకచకా షూటింగ్ లు కంప్లీట్ చేసేస్తున్నారు. అయితే, ఇంతలో భారీ వర్షాలు […]
బాలీవుడ్ లో ఎంతటి క్రేజీ ఆఫర్లు, ఎలాంటి పెద్ద దర్శకుల నుంచీ వచ్చినా… ఒక్క స్టార్ హీరో మాత్రం రిజెక్ట్ చేసేస్తుంటాడు! అతనే… రణబీర్ కపూర్! ఆయన జోయా అఖ్తర్ మూడు సార్లు మూవీస్ ఆఫర్ చేస్తే నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించాడు. ‘జిందగీ నా మిలేగీ దుబారా, దిల్ దఢక్ నే దో, గల్లీ బాయ్’ చిత్రాలు మొదట రణబీర్ వద్దకే తీసుకెళ్లింది జోయా! కానీ, ఎందుకో ఏమో వద్దనేశాడు ఆర్కే. ఇక ఇప్పుడు, నన్ అదర్ ద్యాన్, […]
బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీ షూటింగ్ లో గాయపడింది. “భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా” షూటింగ్‌లో ఓ నటుడు గన్ వాడేటప్పుడు ప్రమాదవశాత్తూ అది నోరా ముఖానికి తగిలడంతో రక్తం కారింది. ఈ యాక్షన్ సన్నివేశంలో ఆమె డూప్ లేకుండా చేయడంతో గాయాలు అయ్యాయి. అయితే తన గాయాన్ని అలాగే భరిస్తూ కారుతున్న రక్తంతోనే షూటింగ్‌లో పాల్గొందట. దీంతో ఆ సీన్ మేకప్ లేకుండానే చాలా సహజంగా వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ యాక్షన్ సన్నివేశాన్ని […]
అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి ప్రిక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఇక నాగచైతన్య పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. చైతు పాత్రకి జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఆగస్టు మూడో వారం నుంచి చిత్రీకరణ షురూ చేయనున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేస్తున్నారు. గ్రామీణ […]
మెగాస్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన కు జూలై 20తో 32 సంవత్సరాలు నిండుతాయి. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు కొవిడ్ 19 నిబంధనలను పాటిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అంతేకాదు… ఉపాసనకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంచి మనసున్న మనిషి, పరోపకారి, సామాజిక కార్యకర్త అయిన ఉపాసన భావాలకు తగ్గట్టుగానే చెర్రీ అభిమానులు పలు కార్యక్రమాలు చేయబోతున్నారు. అపోలో […]
ఆగస్ట్ 15వ తేదీన ఇండియన్ ఐడల్ సీజన్ 12 ముగియనుంది. రికార్డు స్థాయిలో 12 గంటల పాటూ గ్రాండ్ ఫినాలే అలరించనుందట! అయితే, గతంలో ఇండియన్ ఐడల్ టైటిల్ గెలిచిన విజేతలంతా ఒకే వేదికపైకి వస్తారని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే… ఎవరెవరు రాబోతున్నారు? ఇండియన్ ఐడల్స్ గా ఇంతకు ముందు నిలిచిన వారెవరు? లెట్స్ హ్యావ్ ఏ లుక్… Read Also: ‘డ్రామా జూనియర్స్’ లో రాజేంద్రుడి రచ్చ! ఇండియన్ ఐడల్ మొట్ట మొదటి సీజన్ […]
కల్కి కృష్ణమూర్తి రాసిన ఐదు భాగాల చారిత్రక నవల ‘పొన్నియిన్ సెల్వన్’ను వెండితెరపై ఆవిష్కరించాలని చాలామంది దర్శకులు ఎంతో కాలంగా కలలు కంటున్నారు. అయితే.. దాన్ని సాకారం చేసుకుంటోంది మాత్రం ప్రముఖ దర్శకుడు మణిరత్నమే. ప్రముఖ నటీనటులు విక్రమ్, ‘జయం’ రవి, కార్తి, ఐశ్వర్యారాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, లాల్, జయరామ్, ప్రకాశ్ రాజ్, రియాజ్ ఖాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా తొలిభాగానికి సంబంధించిన నయా పోస్టర్ ను సోమవారం విడుదల […]
మనలో చాలా మంది ఉదయాన్నే లేవాలనుకుంటాం! లేవగానే ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాం! చూడగానే ‘వావ్’ అనిపించేలా ఫిజిక్ సాధించాలనుకుంటాం! కానీ, యాజ్ యూజ్ వల్… ‘పడుకుంటాం’! ఇదంతా జాన్వీ విషయంలో మాత్రం రాంగ్… జాన్వీ కపూర్ స్టార్ కిడ్. ఆమెకు బాలీవుడ్ లో ఎంట్రీ పెద్దగా కష్టపడకుండానే వచ్చింది. కానీ, ఇప్పుడిక ప్రూవ్ చేసుకునే టైం కూడా వచ్చేసింది. నటనతో పాటూ అందంతోనూ, ఆకర్షణతోనూ బీ-టౌన్ రేసులో తను దూసుకుపోవాలి. అంతే తప్ప తల్లి శ్రీదేవి పేరు, తండ్రి […]
కొందరు వ్యక్తులు తెలిసీ తెలియక చేస్తున్న పనులు హీరో సిద్ధార్థ్ కు తలనొప్పిని తెచ్చిపెడుతున్నాయి. చిత్రం ఏమంటే ఆ విషయాన్ని స్వయంగా సిద్ధార్థే సోషల్ మీడియాలో చెప్పుకుంటున్నాడు. ఇటీవల ఓ యూ ట్యూబ్ ఛానెల్ కు సంబంధించిన థంబ్ నెయిల్ సిద్ధార్థ్ ను షాక్ కు గురిచేసింది. ‘యుక్తవయసులో చనిపోయిన 10 మంది దక్షిణాది ప్రముఖ తారలు’ అంటూ ఓ వీడియోను ఒక యూ ట్యూబ్ ఛానెల్ పోస్ట్ చేసింది. దాని థంబ్ నెయిల్ లో సౌందర్య, […]