GST 2.O.: జీఎస్టీ 2.O అమలుతో వివిధ రంగాలపై సానుకూల ప్రభావం కనిపిస్తోంది. పైగా జీఎస్టీ 2.O పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రచారం చేస్తున్నారు. నూతన జీఎస్టీ నిర్ణయాలు దేశంలోని బొగ్గు రంగంపై సానుకూలంగా కనిపిస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తిదారులు, వినియోగదారులు ఇద్దరికీ లాభం చేకూరేలా తాజా జీఎస్టీ నిర్ణయాలు సమతుల్యంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్ దిశగా ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
జీఎస్టీ సంస్కరణల్లో కోల్ రంగంపై నిర్ణయాలు చూస్తే.. బొగ్గుపై జీఎస్టీ పరిహార సెస్ రద్దు, అలాగే ప్రతి టన్ను కోల్ పై రూ.400 ల పరిహార సెస్ ను తొలిగించింది జీఎస్టీ కౌన్సిల్. ఇంకా బొగ్గుపై గతంలో జీఎస్టీ 5% నుంచి 18%కి పెంపు ఉండగా.. జీఎస్టీ నిర్ణయాలతో వినియోగదారులకు లాభం కానుంది. కొత్త విధానంతో బొగ్గు ధరల్లో గణనీయమైన తగ్గింపు వచ్చింది. G6 నుంచి G17 గ్రేడ్‌ల వరకు టన్నుకి రూపాయలు 13.40 నుంచి 329.61 వరకు ధరలు తగ్గాయి. విద్యుత్ రంగానికి టన్నుకి సగటు రూ.260 తగ్గిపోగా, దీని వలన ప్రతి యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ఖర్చు 17–18 పైసలు తగ్గనుంది.
Javeria Abbasi: ఇంకెవరు దొరకలేదేమో.. సొంత అన్ననే పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్
పన్ను భారం సమీకరణ:
గతంలో ప్రతి టన్నుకి రూ.400 సెస్ ఉండటంతో తక్కువ నాణ్యత గల బొగ్గుపై అధిక పన్ను పడేది. ఉదాహరణకు, కోల్ ఇండియా లిమిటెడ్ ఉత్పత్తి చేసే G-11 నాన్‌కోకింగ్ కోల్‌పై పన్ను భారము 65.85% ఉండగా, G2 బొగ్గుపై 35.64% మాత్రమే ఉండేది. కొత్త మార్పులతో అన్ని గ్రేడ్‌లపై సగటు పన్ను భారము 39.81% వద్ద సమానంగా ఉంది.
దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే సంస్కరణ:
గతంలో ఫ్లాట్ సెస్ కారణంగా దిగుమతి చేసుకునే అధిక నాణ్యత గల బొగ్గు ధర తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆ సమస్య తొలగి, దేశీయ బొగ్గు పోటీ శక్తి పెరిగింది. దీని వలన దిగుమతులపై ఆధార పడాల్సిన అవసరం తగ్గించి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి బలం చేకూరుతుంది.
Police Arrest: బీటెక్ విద్యార్థి జాదవ్ సాయి తేజ ఆత్మహత్య కేసులో ఐదుగురు అరెస్ట్
ఇన్‌వర్టెడ్ డ్యూటీ సమస్యకు పరిష్కారం:
మునుపు బొగ్గుపై 5% జీఎస్టీ ఉండగా, బొగ్గు సంస్థలు వినియోగించే ఇన్‌పుట్ సర్వీసులపై 18% జీఎస్టీ ఉండేది. ఈ తేడాతో కోల్ కంపెనీల ఖాతాల్లో వాడుకోలేని జీఎస్టీ క్రెడిట్ నిల్వవుతుండేది. ఇప్పుడు 18%కి పెంచడంతో ఆ క్రెడిట్‌ను భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చు. దీని వలన నిధులు అన్‌లాక్ అయ్యి, కంపెనీల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. జీఎస్టీ రేటు పెరిగినా, పరిహార సెస్ తొలగింపుతో వినియోగదారులపై మొత్తం పన్ను భారము తగ్గింది. బొగ్గు ఉత్పత్తిదారులకు ఆర్థిక స్థిరత్వం వస్తుంది. విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తగ్గి వినియోగదారులకు లాభం చేకూరుతుంది. దేశీయ బొగ్గుకు డిమాండ్ పెరిగి, దిగుమతులు తగ్గుతాయి. ఈ నిర్ణయాలు ఉత్పత్తిదారులకూ, వినియోగదారులకూ లాభం చేకూర్చేలా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.