డిల్లీ - భారతదేశ ఉపరాష్ట్రపతి పదవి కోసం సెప్టెంబర్ 9 ఎన్నిక జరగనుంది. ఎన్డిఏ కూటమి నుంచి సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి నుంచి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి లు ఉపరాష్ట్రపతి పదవి కోసం పోటీ పడుతున్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉభయ సభల్లో ఉన్న సభ్యుల్లో మెజారిటీ మెంబర్లు ఎన్డీఏ కూటమి వైపే ఉన్నారు.
ఢిల్లీ – దేశంలో పెరిగిపోతున్న సైబర్ నేరాలపై కేంద్ర హోంశాఖ స్పెషల్ ఫోకస్ పెట్టింది. సైబర్ నేరాలను అరికట్టేందుకు పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. ఒకవైపు సైబర్ నేరాలను అడ్డుకుంటూనే మరోపక్క నేరస్థుల నుంచి రికవరీలు కూడా చేస్తున్నారు. దేశంలో సైబర్ మోసగాళ్ల నుండి ఇప్పటి వరకు రూ.5489 కోట్లను రికవరీ జరిగింది. అయితే రికవరీ అయిన సొమ్మును బాధితులకు రీఫండ్ చేసే విషయంలో ప్రస్తుతం ఉన్న నిబంధనలను సులభతరం చేసే అంశంపై కేంద్రం యోచిస్తోంది. అత్యంత ప్రాధాన్యత […]
Vice President election: ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా బీజేపీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. విపక్ష పార్టీలు అభ్యర్థి పెట్టకుండా తమ అభ్యర్థికే మద్దతు పలకాలని చర్చలు మొదలు పెట్టారు కమలనాథులు. ప్రతిపక్ష నేతల మద్దతు కోసం వాళ్లతో చర్చించడానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. సెప్టెంబర్ 9 న ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం పోలింగ్ జరగనుంది. ఆగస్టు 21 నామినేషన్లకు చివరి రోజు. దాంతో ఇప్పటికే ఎన్డీయే తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా […]
దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి స్కూళ్లకు బాంబ్ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు భయాందోళనకు గురయ్యారు.
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్ర చేయనున్నారు. ఇప్పటికే భారత్ జోడో పేరుతో రెండు యాత్రలు చేసి దేశం చుట్టి వచ్చారు. ఇక ఆదివారం నుంచి 16 రోజుల పాటు బీహార్ లో ఓటర్ అధికార్ యాత్ర చేయనున్నారు. ఓటర్ అధికార్ యాత్రలో బీహార్ లోని ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్ తో పాటు ఇండియా కూటమి నేతలు పాల్గొంటారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే దేశంలోనే ఒక ప్రత్యేకమైన పాపులారిటీ ఉంది. యూపీలో సంచలన నిర్ణయాలను అమలు చేస్తూ సీఎం యోగి పాపులర్ అయ్యారు . అయితే ఇంతకాలం యోగి ఆదిత్యనాథ్ తీసుకునే నిర్ణయాలను బిజెపి కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు మెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న యూపీ అసెంబ్లీలో ఏకంగా సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసించారు. ఆయన పాలనను పొగడ్తలతో అసెంబ్లీ వేదికగా ముంచేస్తారు. మా పార్టీలో గెలిసి మేం […]
Youth Awardees Meet President: ఒక దేశం ఒకే ఎన్నిక అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ చర్చలు చేస్తోంది. అయితే ఎన్నికల అంశంపై యువతలో అవగాహన పెంచేందుకు దేశవ్యాప్తంగా చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఒక దేశం – ఒకే ఎన్నిక కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు యువకులు. రాష్ట్రపతిని కావలసిన వాళ్లలో ఆంధ్రప్రదేశ్ యువజన అవార్డ్ […]
డిల్లీ – కంచ గచ్చిబౌలి అడవుల నరికివేతపై సుప్రీం కోర్టులో విచారణ. సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో అడవుల నరికివేతను సుమోటోగా విచారించిన సుప్రీం కోర్ట్. పర్యావరణాన్ని, వన్య ప్రాణులను రక్షించేలా ప్రతిపాదనలు రెడీ చెయ్యాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. గతంలో కంచ గచ్చిబౌలి వ్యవహారంలో సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి కోసం రాత్రికి రాత్రి వందల బుల్డోజర్లతో అడవులను నాశనం చేస్తారా అంటూ సుప్రీం కోర్ట్ మండిపడింది. అంతేకాదు వెంటనే విద్వంసం ఆపేయాలని ఆదేశించింది. […]
ఢిల్లీ- దేశంలో ఏ మూలన సైబర్ క్రైం జరిగినా ఇట్టే పట్టేసేంత టెక్నాలజీ, సైబర్ క్రైంను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం, సైబర్ నేరస్థులను నిలవరించేందుక భారీ వ్యూహంతో రంగంలోకి దిగింది కేంద్ర హోంశాఖ, భారతదేశంలో సైబర్ నేరాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. NCRB రికార్డ్స్ ప్రకారం ప్రతి గంటకు 8 మంది సైబర్ నేరస్థులకు బలైతున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున ఆర్ధిక […]
Supreme Court: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత కిరాతకంగా జరిగిన న్యాయవాద దంపతుల హత్య కేసును సీబీఐకి బదిలీ చేసింది సుప్రీం కోర్టు. 2021 ఫిబ్రవరి 17న గట్టు వామనరావు, ఆయన భార్య నాగమణిల హత్య జరిగింది. పెద్దపల్లి జిల్లా కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న వామనరావు దంపతులను అడ్డుకొని నడిరోడ్డుపై హత్య చేశారు. అయితే వామనరావు దంపతుల హత్య కేసు అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తన కొడుకు , కోడలు హత్య కేసును సీబీఐకి బదిలీ చెయ్యాలని…