CPI Narayana: సీపీఐ నారాయణ పార్టీలోని కీలక పదవుల నుంచి తప్పుకున్నారు. గత కొన్ని ఏళ్లుగా సీపీఐ జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న నారాయణ తన పదవి నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. పంజాబ్- చండీగఢ్ లో జరిగిన 25వ సీపీఐ మహాసభల్లో కీలక నిర్ణయాలు జరిగాయి. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాను మినహాయించి, 75 ఏళ్లు నిండిన వాళ్లందరినీ తప్పించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడం, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనే అంశాలపై గతంలో విజయవాడలో జరిగిన పార్టీ మహా సభల్లోనే ప్రధానంగా చర్చ జరిగింది. అమలులో కొంత ఆలస్యమైనా మొత్తానికి పంజాబ్ లో జరిగిన మహా సభల్లో కచ్చితంగా అమలు చేయాలని కామ్రేడ్లు అనుకున్నారు. దానికి అనుగుణంగానే 75 ఏళ్లు నిండిన వాళ్లందరినీ కీలక పదవుల నుంచి తప్పించారు.
Read Also: Vijay Sethupathi : ‘బెగ్గర్’, ‘మాలిక్’ కాదు.. విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్ సినిమా టైటిల్ ఇదే!
సీపీఐ పార్టీలో కంట్రోల్ కమిషన్ ఏంటి?
సాధారణంగా జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్రాల కార్యవర్గ సభ్యులు ముఖ్య నాయకులు అందరూ పార్టీకి సంబంధించినటువంటి భవిష్యత్తు కార్యాచరణపై, రాజకీయ అంశాలపై నిర్ణయాలు తీసుకుంటారు. అయితే, బయటి రాజకీయాలు కాకుండా పార్టీలో అంతర్గతంగా తలెత్తే సమస్యలను, వాటిని పరిష్కరించే పని కంట్రోల్ కమిషన్ చూస్తుంది. కంట్రోల్ కమిషన్ కు చైర్మన్, సెక్రెటరీ ఉంటారు. మొత్తం 9 మంది సభ్యులు ఈ కమిషన్ లో ఉంటారు.
Read Also: CM Revanth Reddy: స్కిల్స్ ఉంటే చైనా, జపాన్ లాంటి దేశాలు మన ముందు మోకరిల్లుతాయి..
తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారాయణ
కామ్రేడ్ నారాయణ ప్రజా పోరాటాలతోనే కాదు, తన మాటల తూటాలతోను ప్రజల్లో, పత్రికల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సీపీఐ నారాయణ, చికెన్ నారాయణ, అంతేకాదు ఇతర పార్టీలు నారాయణకు ఎన్నో బిరుదులు ఇచ్చాయి. ఎన్నో విమర్శలు కూడా చేశారు. కొన్నిసార్లు అయితే నోరు పారేసుకునే నారాయణ అని కూడా అతడ్ని కామెంట్ చేశారు. అయితే, సీపీఐ నారాయణ మాత్రం ఎప్పుడు తన శైలి మార్చుకోలేదు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వాలపై తన మాటల తూటాలతో పేలుస్తూనే ఉండేవాడు. జాతీయ స్థాయిలో గత కొంతకాలంగా పని చేస్తున్న నారాయణ దేశవ్యాప్తంగా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్న ఎక్కడ ఉన్నా సరే, ప్రతిరోజు కీలక అంశాలపై స్పందిస్తూనే ఉంటారు. అంతెందుకు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, గవర్నర్లు, రాష్ట్రపతులు ఇలా ఎవరిని సీపీఐ నారాయణ వదల్లేదు.