గోషామహల్లో చాక్నావాడి నాళా మరోసారి కుంగింది. కుంగిన సమయం అర్ధరాత్రి కావడంతో పెను ప్రమాదం తప్పింది. దారుసల్లాం నుండి చాక్నావాడి వెళ్లే దారి మధ్యలో సివరేజి నాళా కుంగిపోయింది. ఇప్పటికే గతంలో రెండు సార్లు ఈ నాళా కుంగింది. గతంలో కుంగిన నాళా నిర్మాణ పనులకు కోసమని రీడిమిక్స్ లారీ అక్కడకు వచ్చింది. అయితే.. నాళాపై నుండి లారీ వెళ్లడంతో మరోసారి నాళా కుంగింది. దీంతో.. స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కాగా.. నిత్యం నాళాలు కుంగడంతో స్థానికులు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. దారుసల్లాం చౌరస్తా నుంచి చాక్నావాడా మీదుగా గోషామహల్ పోలీస్ గ్రౌండ్ వరకు సివరేజ్ నాళా ఉంది. సుమారు కిలో మీటర్ పైగా అండర్ గ్రౌండ్ సివరేజ్ నాళా ఉంది. పురాతన నాళా కావడంతో తరచూ కుంగిపోతుంది.
Read Also: Bandi Sanjay: కేసీఆర్ కుటుంబాన్ని బీజేపీ వదిలిపెట్టదు.. కేంద్రమంత్రి హాట్ కామెంట్స్
గత ప్రభుత్వ హయాంలో కూడా చాక్నావాడిలో ఉన్న నాళా కూలింది. దీంతో అప్పటి ప్రభుత్వం మంత్రులు అధికారులు సందర్శించి నాలా పనులు పూర్తి చేశారు. అయితే.. కొన్ని రోజుల క్రితమే చాక్నావాడిలో మళ్లీ నాలా కుంగింది. ఈ క్రమంలో.. ఆ నాళాను అధికారులు మరమ్మతులు చేసేందుకు పనులు ప్రారంభించారు. అయితే.. పనులు జరుగుతున్న సమయంలో దారుసలాం రోడ్డు నుండి చాక్నావాడికి వెళ్లే రోడ్డులో మరోసారి నాలా గురువారం అర్ధరాత్రి కుంగింది.
Read Also: Vishal : హీరో విశాల్ హెల్త్ కండీషన్ పై స్పందించిన స్టార్ హీరో..ఏమన్నారంటే ?