Mansoon Season Health Problems: వర్షాకాలం వచ్చిందంటే అనారోగ్య సమస్యలు(Health Problems) షురు అవుతాయి. ఎక్కువగా జ్వరం, జలుబు, దగ్గు తరచుగా వ్యాప్తి చెందుతుంది. అందుకోసం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడం అవసరం. ఆరోగ్యకరమైన జీవనశైలి, పౌష్టికాహారాల వినియోగంతో వర్షాకాలంలో వచ్చే వ్యాధుల నుంచి జాగ్రత్తపడొచ్చు. వర్షాకాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా చిన్న పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. ఈ సీజన్ లో అంటువ్యాధులు వేగంగా వ్యాపిస్తాయి. అందుకోసమని వారిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. అలాగే పెంపుడు జంతువుల ఆరోగ్యంపై కూడా కాస్త శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా పరిసరాలు శుభ్రంగా లేకపోవడం.. నీరు నిల్వ ఉండడం వలన దోమలు సమస్య పెరుగుతుంది. అయితే వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి పాటిస్తే.. రోగాల బారినుండి తప్పించుకోవచ్చు.
Read Also: MLC Kaushik Reddy : ఈటలపై నేను ఎమ్యెల్యేగా గెలిచినప్పుడే నాకు తృప్తి
సహజంగా ఉల్లిపాయలు, వెల్లుల్లి యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటిని ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచింది. ఇది వర్షాకాలంలో వ్యాపించే జలుబు, గొంతు నొప్పిని తగ్గిస్తుంది. అంతేకాకుండా వర్ష కాలం కూడా పుష్కలంగా నీరు తాగాలి. కొందరు వర్షాకాలంలో దాహం వేయడం లేదని నీరు తాగడం తగ్గిస్తారు. కానీ దాహం వేయకపోయినా నీరు తాగాలి.. ఆరోగ్యానికి చాలా ముఖ్యం.
Read Also: ICC World Cup 2023: వరల్డ్ కప్ సెమీ ఫైనలిస్ట్ జట్లు ఇవే.. జోస్యం చేప్పిన మాజీ ప్లేయర్స్
మరోవైపు ఎక్కువగా వర్షాకాలం ఆహారం ద్వారా ఇన్ఫెక్షన్లు వస్తాయి. అయితే అవి రాకుండా ఉండాలంటే స్ట్రీట్ ఫుడ్ ను తీసుకోకపోవడం మేలు. ఎందుకంటే ఆ ఆహారం కలుషితమయ్యే అవకాశం ఉంది. అందుకోసమని జీర్ణశయ సమస్యలను తగ్గించడానికి.. ఆరోగ్యంగా ఉండేందుకు కేవలం ఇంట్లో వండిన ఆహారాన్ని తినండి. పెరుగు, పులియబెట్టిన కూరగాయలు వంటి ఆహారాలను తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడమే కాకుండా.. శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. అవి జీర్ణవ్యవస్థలో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించడం ద్వారా జీర్ణశయ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.