గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు, వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీలోని అన్ని పాఠశాలలను సోమవారం ఒక్కరోజు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు.
రసాయనిక ఎరువులు వాడితే ఎక్కువ దిగుబడులు వస్తాయని చాలా మంది రైతులు భావిస్తున్నా ఆ పరిస్థితి లేదు. రైతు సోదరులు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తేనే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు. ఇందుకోసం ఆవు పేడ, వర్మీకంపోస్టును ఎరువుగా ఉపయోగించాలి. ఇప్పుడిప్పుడే రైతాంగం సేంద్రియ వ్యవసాయం వైపు అడుగులు వేస్తోంది. సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి చేసే పండ్లు మరియు కూరగాయల ధర కూడా చాలా ఎక్కువ. అంతేకాకుండా ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహిస్తోంది.
నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ మైదానంలోకి దిగిన భారత మహిళా క్రికెట్ జట్టు అనుకున్నట్టుగానే విజయాన్ని నమోదు చేసింది. మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో టీమిండియా మహిళల జట్టు విజయం సాధించింది. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టి20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
కెనడా ఓపెన్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ లక్ష్య సేన్ ఫైనల్ కు చేరుకున్నాడు. జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోపై వరుస గేమ్‌లతో విజయం సాధించి ఈ ఘనత సాధించాడు. మరోవైపు ప్రపంచ నం.1 క్రీడాకారిణి అకానె యమగుచి సెమీఫైనల్లో పీవీ సింధును ఓడించింది. మహిళల సింగిల్స్ సెమీ-ఫైనల్స్‌లో జపాన్ నంబర్ వన్ అకానె యమగుచి చేతిలో 14-21, 15-21 తేడాతో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు ఓడిపోయింది.
శనివారం వీరిద్దరూ స్టైల్ షర్టులు ధరించి ఓ హోటల్ కు లంచ్ చేయడానికి వెళ్లారు. వారిద్దరికీ ఇష్టమైన సుషీ డిష్ ను తింటూ.. కెమెరాకు ఫోజులు ఇస్తూ.. ఎంజాయ్ చేశారు. ఇదంతా ఒకవైపు ఐతే.. మరోవైపు ముంబయి ఇండియన్స్ ఓ ఆసక్తికరమైన విషయాన్ని పసిగట్టింది. లంచ్ చేస్తూ దిగిన ఫొటోలో ఇషాన్ కిషన్ ధరించిన షర్ట్ గతంలో శుభ్ మన్ గిల్ తన ప్యారిస్ ట్రిప్‌లో ధరించినట్టు గుర్తించారు.
తాబేలు పామును తినడం ఎప్పుడైనా చూసారా?. మాములగా ఐతే పాములు కప్పలు, పురుగులను తింటుంది. తాబేలు మాత్రం మట్టి, గడ్డి లాంటివి తింటూంటాయి. అయితే ఈ వీడియోలో తాబేలు పామును తింటుంది. అది చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఓ కుక్క చేసిన అద్భుత నటన అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆ ఫన్నీ వీడియోను మీరు చూడండి. ఓ వ్యక్తి మరొక వ్యక్తిని కాల్చినప్పుడు.. ఎలా ఐతే చేస్తాడో.. అచ్చం అలాగే ఆ కుక్క కూడా చేసింది.
పాము పెద్ద బల్లిని (గెక్కో) కదలకుండా గట్టిగా పట్టుకుంది. అయితే అక్కడే ఉన్న మరొక బల్లి తన భాగస్వామిని కాపాడేందుకు పామును బెదిరించి తలపడుతుంది. పాము బల్లిని పూర్తిగా బిగించి, దానిని తినడానికి ఎలా సిద్ధంగా ఉందో మీరు చూడవచ్చు. అయితే మరొక బల్లి అక్కడికి చేరుకుని.. పాముపై దాడి చేస్తుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రాజస్థాన్‌లోని బికనీర్ జిల్లాలో పర్యటించారు. అందులో భాగంగా రూ.24,300 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ప్రధాని మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో ప్రధానికి వినూత్నంగా సైకిలిస్టులు స్వాగతం పలికారు. ఆ సమయంలో ప్రధానమంత్రి కారుతో పాటు సైకిల్ తొక్కుతూ కనిపించారు. ప్రధానమంత్రి రోడ్‌షో సందర్భంగా ఆయనను చూసేందుకు ప్రజలు రోడ్డు పక్కనే నిల్చున్నారు.
ఆఫ్ఘనిస్థాన్ జట్టు స్పిన్ బౌలింగ్‌కు చాలా ఫేమస్ అని క్రికెట్ ఫ్యాన్స్ కు తెలిసిన విషయమే. ఈ జట్టులో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వంటి బౌలర్లు.. ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా ఇబ్బంది పెట్టగలరు. అయితే శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అఫ్గానిస్థాన్ బ్యాట్స్‌మెన్లు తమ సత్తా చాటుతూ భారీ స్కోరు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ 9 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది.