తమ ఆకలికోసం ఇతర జీవులను వేటాడి కడుపు నింపుకునే జీవులు భూమ్మీద చాలానే ఉన్నాయి. ఉదాహరణకు సింహాలు, పులులు మరియు చిరుతపులులు వంటి జంతువులు ఇతర అడవి జంతువులను తమ ఆహారంగా చేసుకుని వాటిని చంపి తింటాయి. పాములు కూడా అలాగే చేస్తాయి. కీటకాలు, కప్పలు మరియు బల్లులతో సహా చిన్న జీవులను కూడా చంపి తింటాయి. చాలా సార్లు ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో కూడా కనిపిస్తాయి. అయితే ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
PM Modi Tour: రోడ్‌షోలో ప్రధాని మోడీకి సైకిలిస్టులు స్వాగతం.. మోడీ మోడీ నినాదాలు
ఈ వీడియోలో పాము పెద్ద బల్లిని (గెక్కో) కదలకుండా గట్టిగా పట్టుకుంది. అయితే అక్కడే ఉన్న మరొక బల్లి తన భాగస్వామిని కాపాడేందుకు పామును బెదిరించి తలపడుతుంది. పాము బల్లిని పూర్తిగా బిగించి, దానిని తినడానికి ఎలా సిద్ధంగా ఉందో మీరు చూడవచ్చు. అయితే మరొక బల్లి అక్కడికి చేరుకుని.. పాముపై దాడి చేస్తుంది. బల్లి చాలా నిర్భయంగా పాముతో పోరాడుతుంది. చివరికి తన భాగస్వామిని కాపాడుతుంది.
Hyderabad Rains: ఇంకో రెండు గంటల్లో హైదరాబాద్ లో భారీ వర్షం..
ఈ షాకింగ్ వీడియో వైల్డ్‌లైఫ్ 011 అనే ఐడితో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియో కంబోడియాలోని ఒక దేవాలయంలో జరిగినట్లు చెబుతున్నారు. అక్కడికి సందర్శించడానికి వచ్చిన ఒక పర్యాటకుడు ఈ సంఘటనను తన కెమెరాలో బంధించాడు. ఇది ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఇప్పటివరకు 25 వేలకు పైగా వీక్షించగా.., వందలాది మంది వీడియోను లైక్ చేసారు. అంతేకాకుండా ఈ వీడియోపై భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న తమ సహచరులను ఎలా కాపాడుకోవాలో మనుషులు కూడా వారి నుంచి నేర్చుకోవాలని వినియోగదారులు చెబుతున్నారు.