రాజస్థాన్‌లో ఇప్పటి నుంచి మృతదేహాలను రోడ్డుపై ఉంచి నిరసన తెలిపితే శిక్ష అనుభవించాల్సందే. అందుకోసం కఠినమైన చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టానికి సంబంధించి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం 3 రోజుల క్రితం అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పేరు 'రాజస్థాన్ డెడ్ బాడీ రెస్పెక్ట్ బిల్ 2023'. ఇది ఇప్పుడు చట్టం రూపంలోకి వస్తుందని.. మృతదేహానికి గౌరవం ఇవ్వడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు ఆ ప్రభుత్వం తెలుపుతుంది.
ప్రధాన నిందితుడు హాజీ ఇజ్‌లాల్‌కు ఇటీవల పెరోల్ రావడంతో.. 15 ఏళ్ల తర్వాత మరోసారి ఈ ఘటన వార్తల్లో నిలిచింది. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యమంత్రి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాన నిందితుడు ఇజ్‌లాల్‌ను విచారించగా మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీరట్ కాలేజీలో చదువుతున్న షీబా సిరోహి అనే విద్యార్థినితో ఇజ్లాల్ ఏకపక్షంగా ప్రేమలో ఉన్నాడని పోలీసులకు తెలిపాడు.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ భారతదేశంలోనే అత్యంత సంపన్న ఎమ్మెల్యే అని ఓ నివేదిక వెల్లడించింది. డీకే శివకుమార్ ఆస్తుల విలువ రూ.1,413 కోట్లు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) నివేదిక పేర్కొంది.
మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో చీతాల వరుస మృతిపై భారత అత్యున్నత న్యాయస్థానం(Supreem Court) ఆందోళన వ్యక్తం చేసింది. భారత ప్రభుత్వం విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఒకదాని వెంట ఒకటి మృతి చెందుతుండటంతో.. దేశ వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ వ్యాప్తంగా కలకలం రేపుతుంది. చీతాల మృతికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, ప్రశాంత్ కుమార్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. గతవారం రెండు చీతాలు చనిపోవడాన్ని ప్రస్తావించిన సుప్రీం.. దీనిని ఎందుకు ప్రతిష్టాత్మకంగా మారుస్తున్నారని…
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఓ గ్రామంపై కొండచరిచయలు విరిగిపడటంతో 13 మంది మరణించారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 100 మందికి పైగా చిక్కుకున్నారు. ఖలాపూర్ తహసీల్‌లోని ఇర్షాల్‌వాడి గ్రామంలోని ఇళ్లపై కొండ రాళ్లు, మట్టిపెళ్లలు పడటంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం 48 కుటుంబాలు చిక్కుకున్నాయి.
జార్ఖండ్‌లోని లతేహార్ జిల్లాలో అర్థరాత్రి నక్సలైట్లు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని నెటార్‌హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దావ్నా, పురందీ గ్రామాల్లో హల్ చల్ చేశారు. అంతేకాకుండా ఐదుగురిని పోలీస్ ఇన్‌ఫార్మర్లు అనే నెపంతో.. వారిని ఇంటి నుంచి తీసుకెళ్లారు.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. రాజకీయ ఎత్తుగడలు మాత్రం మొదలయ్యాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ పాకులాడుతుండగా.. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. అందుకోసం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్నికల సమరంలో జోరుమీదున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక గాంధీ.. శుక్రవారం గ్వాలియర్-చంబల్ ప్రాంతంలో పర్యటించనున్నారు.
సచిన్ తో ప్రేమలో పడి.. నేపాల్ మీదుగా ఇండియాలోకి వచ్చిన సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. సీమా ప్రేమికురాలేనా.. లేదా పాకిస్థాన్ గూఢచారా అనే అనుమానాలు తావెత్తుతున్నాయి. సీమా హైదర్ ని ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
ఒక వ్యక్తి ప్రపంచ రికార్డు కోసం వింతగా ఆలోచించాడు. కన్నీరు కార్చి రికార్డు సాధిస్తానని వారం మొత్తం నాన్‌స్టాప్‌గా ఏడవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి కంటిన్యూగా ఏడవడంతో.. తాత్కాలికంగా కంటిచూపు కోల్పోయాడు.
పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్, తన ప్రేమికుడు సచిన్‌లను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (యూపీ ఏటీఎస్) వరుసగా మూడో రోజు విచారించింది. సీమాతో సచిన్ ఎలా స్నేహం చేశాడు.. ఆమె నేపాల్ ద్వారా అక్రమంగా భారత్‌కు ఎలా చేరుకుంది అని యూపీ ఏటీఎస్ ప్రెస్ నోట్ ఇచ్చింది.