గిన్నీస్ బుక్ లో రికార్డు కోసం ప్రాణాలకు తెగించైనా సాహసాలు చేస్తారు. ప్రపంచంలో ఎవరూ చేయని.. సాధ్యం కాని పనులను చేసి గిన్నీస్ లోకి ఎక్కుతుంటారు. ఇప్పటి వరకు ఎన్నో అరుదైన ఫీట్లు సాధించి.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ లో చోటు సంపాదించుకున్నారు. కొందరు చేసే పనులు సక్సెస్ అయితే.. మరికొందరు చేసేవి మిస్ ఫైర్ అవుతుంటాయి. అయితే ఒక వ్యక్తి ప్రపంచ రికార్డు కోసం వింతగా ఆలోచించాడు. కన్నీరు కార్చి రికార్డు సాధిస్తానని వారం మొత్తం నాన్‌స్టాప్‌గా ఏడవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ వ్యక్తి కంటిన్యూగా ఏడవడంతో.. తాత్కాలికంగా కంటిచూపు కోల్పోయాడు.
Minister Viswaroop:ఏపీలో ముందస్తు ఎన్నికలు..? మరోసారి క్లారిటీ ఇచ్చిన మంత్రి
నైజీరియాలో ఓ వ్యక్తి గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించడం కోసమని.. ఏడు రోజుల పాటు బలవంతంగా ఏడ్చాడు. టెంబు ఎబెరే అనే వ్యక్తి కన్నీరు కార్చి గిన్నీస్ రికార్డు కోసం ప్రయత్నించాడు. అయితే వారం మొత్తం నాన్‌స్టాప్‌గా ఏడవడంతో.. అతని కంటి చూపు వ్యవస్థ దెబ్బతిన్నది. దీంతో తాత్కాలికంగా చూపును కోల్పోయాడు. దాదాపు 45 నిమిషాల పాటు అతనికి కళ్లు కనపడలేదు. విపరీతమైన తలనొప్పి, ముఖం వాపు, ఉబ్బిన కళ్లతో బాధపడ్డాడు. అనంతరం ఆ వ్యక్తి మాట్లాడుతూ.. గిన్నీస్ బుక్ రికార్డు కోసం ప్రయత్నించగా కంటిచూపు తాత్కాలికంగా పోయిందని..
అందుకే ఏడుపును ఆపినట్లు తెలిపాడు. అయితే కన్నీటి-ప్రయత్నాన్ని పూర్తి చేయాలని నిశ్చయించుకున్నప్పటికీ సాధ్యపడలేదని ఎబెరే చెప్పాడు. మరోవైపు అతను చేసిన ప్రయత్నాన్ని జీడబ్ల్యూఆర్ కి దరఖాస్తు చేయనప్పటికీ.. లెక్కలోకి తీసుకోలేదు. ఏది ఏమైనప్పటికీ.. అతను రికార్డ్-బ్రేకర్ కాదు, చాలా మంది నైజీరియన్లు ఇలాంటి క్రేజీ ఆలోచలనతో రికార్డు కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. మరోవైపు వరల్డ్ గిన్నిస్ రికార్డ్ కోసం పిచ్చిపిచ్చి ప్రయత్నాలు చేయొద్దని.. జాగ్రత్తగా ఉండాలని నైజీరియన్లను కోరింది.