చేతుల్లో నుంచి జారీ డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన ఘటన బుధవారం థానేలోని ఠాకుర్లీలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు అంబర్ నాథ్ లోకల్ రైలులో ప్రయాణిస్తుండగా.. వర్షం కారణంగా రైలును ఠాకుర్లీ వద్ద నిలిపివేశారు. అయితే రైలు ఆగిందని దిగి.. రైల్వే ట్రాక్ వెంట నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే ప్రమాదవశాత్తు వారు వెళ్తుండగా చేతిలో నుంచి జారీ నాలుగు నెలల పసికందు డ్రైనేజీలో పడి కొట్టుకుపోయింది.
చాలా వివాదాలు మరియు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆసియా కప్ 2023 షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్, బీసీసీఐ కార్యదర్శి జై షా టోర్నీ మొత్తం షెడ్యూల్‌ను ప్రకటించారు.
దేశంలోని విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమికి I.N.D.I.A అని పేరును పెట్టుకోవడం తెలిసిందే. అయితే ఆ పేరును తప్పుడు ప్రచారంగా వాడుకుంటున్నట్లు పోలీస్ కేసు నమోదైంది. I-N-D-I-A పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని బరాఖంబ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కర్ణాటక అసెంబ్లీ నుండి 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. సభలో అసభ్యకరంగా, అమర్యాదకరంగా ప్రవర్తించినందుకు వారిని డిప్యూటీ స్పీకర్ సస్పెండ్ చేశారు.
ముంబై నుంచి అమృత్‌సర్ వెళ్తున్న గోల్డెన్ టెంపుల్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో పోలీసు బలగాలు అలర్ట్ అయ్యారు. వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు.
గుజరాత్ లో వర్షాలు బాగా కురుస్తున్నాయి. నేడు గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. కొన్ని గంటల్లోనే 300 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజ్‌కోట్, సూరత్, గిర్ సోమనాథ్ జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వరదల దాటికి కాలనీల్లో నిలిచి ఉన్న కార్లు మునిగిపోయాయి.
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని నమామి గంగే ప్రాజెక్టు వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అలకనంద నది ఒడ్డున ఉన్న ప్రాజెక్ట్ సైట్‌లోని ట్రాన్స్‌ఫార్మర్‌లో పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంపై సీఎం పుష్కర్ సింగ్ ధామి విచారణకు ఆదేశించారు.
ట్రినిడాడ్‌లో ప్లేయింగ్ లెవన్ పై కెప్టెన్ రోహిత్ శర్మను అడిగినప్పుడు.. సమాధానం చెప్పలేదు. అంతేకాకుండా చాలా కారణాలను చెప్పాడు. డొమినికా మరియు పోర్ట్ ఆఫ్ స్పెయిన్ మధ్య వ్యత్యాసాన్ని ఎత్తి చూపాడు. డొమినికా పరిస్థితి.. అక్కడి పిచ్ గురించి తనకు బాగా తెలుసునని రోహిత్ అన్నారు. కానీ.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ విషయంలో అలా కాదన్నాడు. అంతేకాకుండా ట్రినిడాడ్ లో ప్రతికూల వాతావరణమే ప్రధాన కారణమని ఆయన పేర్కొన్నారు.