హార్థిక్ పాండ్యా లేని లోటును భర్తీ చేసుకోవడం కోసం టీమ్లో రెండు మార్పులు అవసరమని భజ్జీ సూచించాడు. ధర్మశాల పిచ్ ఎక్కువగా స్వింగ్ అవుతుందని.. ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు బదులు సీమర్ మహమ్మద్ షమీకి అవకాశం కల్పించాలని తెలిపాడు. అంతేకాకుండా.. 6వ స్థానంలో ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్ను ఆడించాలని పేర్కొ్న్నాడు.
ప్రపంచకప్ 2023లో భాగంగా నిన్న(శుక్రవారం) బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 62 పరుగుల తేడాలో ఆసీస్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఊహించని పరిణామం చోటు చేసుకుంది. రెండు గంటలపాటు విద్యుత్ పోవడంతో డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)పని చేయలేదు. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ పరిస్థితి ఏర్పడింది.
షాహీన్ అఫ్రిదీ బౌలింగ్ పై భారత మాజీ దిగ్గజం ఇర్ఫాన్ పఠాన్‌తో పాటు పలువురు ప్రశంసల జల్లు కురిపించారు. “బెంగళూరులోని ఈ ఫ్లాట్ పిచ్‌పై షాహీన్ 5 వికెట్లు తీయడం గొప్ప అని చెప్పుకొచ్చాడు. కేవలం షాహీన్ తప్ప.. మిగతా బౌలర్లు ఫెయిలయ్యారని విమర్శించాడు. మిగతా నెటిజన్లు కూడా స్పందించారు.
ప్రపంచ కప్ 2023లో భాగంగా బెంగళూరులోని ఎం చినస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా గెలుపొందింది. 62 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది.
వరల్డ్ కప్ 2023లో నాలుగింటిలో నాలుగు విజయాలు అందుకుని టీమిండియా జోరు మీదుంది. ఇక భారత్ తన 5వ మ్యాచ్ ను పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ తో తలపడనుంది. అందుకోసం భారత్.. ధర్మశాలకు చేరుకుంది. అక్టోబర్ 22న న్యూజిలాండ్-భారత్ మధ్య మ్యాచ్ జరుగనుంది.
అక్టోబరు నెలలో వేడి శీతాకాలం ప్రారంభమవుతుంది. పగటిపూట వేడిగా ఉంటే.. రాత్రి చల్లగా ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో జలుబు, దగ్గు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. జలుబు, దగ్గుతో తీవ్ర అవస్థలు పడుతూ.. వైద్యుల దగ్గరకు వెళ్లలేని స్థితిలో ఉంటారు. అలాంటి సమయంలో ఇంట్లోనే ఉంటూ విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఇంట్లోనే ఉంటే విశ్రాంతి వలన ఇవి నయం కావు. వాటికి కొన్ని నివారణ చర్యలు ఉన్నాయి. అవి పాటిస్తే వెంటనే జలుబు, దగ్గు తగ్గిపోతుంది.
డెంగ్యూ జ్వరం అంటే ఎంతో ప్రమాదకరమైనదో చెప్పనక్కర్లేదు. సీజన్ మారుతుందంటే ఇది తొందరగా విజృంభిస్తుంది. డెంగ్యూతో చాలా మంది ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. డెంగ్యూకు ఇంతవరకు నిర్ధిష్టమైన మందులు, చికిత్స విధానాలు లేవు. తాజాగా.. డెంగ్యూ వ్యాధికి తొలి ఔషధాన్ని 'జాన్సన్ అండ్ జాన్సన్' కంపెనీ రూపొందించింది. దీనిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా.. ఈ ప్రయోగం విజయవంతమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఓ అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డ్ ను క్రాస్ చేశాడు. ఈరోజు పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 124 బంతుల్లో 14 ఫోర్లు, 9 సిక్సర్లతో 163 పరుగులు చేశాడు. దీంతో సెంచరీల పరంగా ఓపెనర్లు సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ కంటే తాను చాలా ముందున్నానని వార్నర్ తన సెంచరీతో చాటాడు.
షాహీన్ వేసిన బౌలింగ్ లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్లు కొంచెం తడబడ్డారు. అతను వేసిన అద్భుత బౌలింగ్తో 5 వికెట్లు తీశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాను ఒక్కో పరుగు కోసం కష్టపడేలా చేశాడు. షాహీన్ 5.40 ఎకానమీ రేటుతో 10 ఓవర్లలో 54 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.
ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్ సెంచరీ స్పెషల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే అతని పుట్టిన రోజు ఈరోజే. తన బర్త్ డే రోజే సెంచరీని సాధించడం విశేషం. అక్టోబర్ 20న మార్ష్ 32వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో తన బర్త్‌డే రోజున సెంచరీ చేసి మార్ష్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.