నేటి సాయంత్రం తీవ్ర వాయుగుండం"హమున్" తుఫాన్ గా మారనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గంటకు 13కిలోమీటర్ల వేగంతో కదులుతూ వాయుగుండం బలపడుతుంది. ఈ వాయుగుండం పారాదీప్ కు దక్షిణంగా 360 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. తుఫాన్ గా మారిన తరువాత "హమున్" దిశ మార్చుకోనుంది.
పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో సామాజిక సాధికార యాత్ర సన్నాహా సమీక్ష సభలో మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు లంచాలు తీసుకుని పనులు చేసేవని ఆయన ఆరోపించారు. ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు ఇచ్చి లాయర్లను తెచ్చిన చంద్రబాబు బయటకు ఎందుకు రావడం లేదని విమర్శించారు.
ప్రపంచకప్ 2023లో భాగంగా ధర్మశాల వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపొందింది. భారత్ 48 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 274 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీ అద్భుత బ్యాటింగ్ చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఇదిలా ఉంటే చివరకు ఆడి 95 పరుగులు చేసి ఔటవ్వడంతో తీవ్ర నిరాశకు గురయ్యాడు. ఇంకో 5 పరుగులు చేస్తే సెంచరీ అయ్యేది.…
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మరోసారి అత్యధిక వ్యూయర్ షిప్ నమోదైంది. మొన్న పాకిస్తాన్- ఇండియా మ్యాచ్ లో అత్యధికంగా 3.5 కోట్ల మంది వీక్షించగా, తాజాగా జరిగే న్యూజిలాండ్ మ్యాచ్ లో 4 కోట్లు వ్యూయర్ షిప్ దాటింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో 4 సిక్సర్లు కొట్టి మరే క్రికెటర్ చేయలేని పని చేశాడు. న్యూజిలాండ్‌పై 40 బంతుల్లో 46 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అందులో 4 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. దీంతో రోహిత్ శర్మ ఓ ప్రత్యేకమైన జాబితాలో తన స్థానాన్ని సంపాదించుకున్నాడు. నిజానికి ఒక క్యాలెండర్ ఇయర్‌లో 50 సిక్సర్లు బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
కొబ్బరి నీరు తాగడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, ఎంజైములు, విటమిన్ సి ని కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి నీళ్ల వినియోగం రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు కష్టాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఆడి కష్టాల్లో ఉన్న ఇంగ్లీష్ జట్టుకు ఇదొక బిగ్ షాక్ అని చెప్పవచ్చు. తాజాగా.. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ రీస్ టాప్లీ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రీస్ టోప్లీ వేలికి గాయమైంది. దీంతో మొత్తం టోర్నమెంట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది.
టీమిండియా డైనమిక్ ఓపెనర్ శుభ్మాన్ గిల్ వరల్డ్ కప్లో మంచి ఫాంలో ఉన్నాడు. న్యూజిలాండ్ తో జరుగుతున్న మ్యాచ్లో 26 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో గిల్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 12 ఏళ్ల నాటి వరల్డ్ రికార్డును బద్దలు కొట్టాడు శుభ్మాన్ గిల్. వన్డేల్లో అత్యంత వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసుకున్న బ్యాట్స్ మన్ గా గిల్ రికార్డుల్లోకెక్కాడు.
వరల్డ్ కప్ 2019 సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియాను ఓడించిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు ప్రపంచకప్ గెలవాలన్న కల చెదిరిపోయింది. ఆ సమయంలో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో ఓటమిపై అప్పటి భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఓ సీక్రెట్ విషయాన్ని వెల్లడించాడు. ఆ ఓటమి తర్వాత మహేంద్ర సింగ్ ధోనీతో పాటు రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏడ్చేశారని సంజయ్ బంగర్ చెప్పాడు.
ఆకుకూరలు తింటే అందరి ఆరోగ్యానికి ఎంతో మంచిదన్న విషయం అందరికి తెలుసు. ఆకుకూరలు రోజు తింటే అనేక అనారోగ్య సమస్యల బారినుంచి తప్పించుకోవచ్చు. అందుకే డాక్టర్లు ఎక్కువగా ఆకు కూరలు తినాలని సూచిస్తారు. అయితే ఆకుకూరల అన్నింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఆకుకూరల రకమైన పొన్నగంటి కూరలో శరీరానికి అవసరమైన అనేక పోషకాలుంటాయి. ఇవి ఎక్కువగా పురుషులకు ఎంతో సహాయపడుతాయి.