రేపు(ఆదివారం) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ పోరు జరగనుంది. ఈ మ్యాచ్ కోసం భారత అభిమానులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఫైనల్ మ్యాచ్ కు ముందు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక సందేశం ఇచ్చాడు.
Read Also: Viral Video : రద్దీగా ఉండే కోల్‌కతా స్టేషన్‌లో డ్యాన్స్ చేసిన మహిళ.. వీడియో వైరల్..
“మేము ఇప్పటివరకు చేసిన ప్రతిదీ మా వెనుక సంవత్సరాల కృషికి క్రెడిట్. మేము ఇప్పుడు కీర్తికి ఒక అడుగు దూరంలో ఉన్నాము, మేము చిన్నప్పటి నుండి కలలుగన్న కలను నిజం చేయండి ”అని పాండ్యా అన్నాడు. కప్‌ను తమ కోసం మాత్రమే కాకుండా.. బిలియన్ భారతీయ ప్రజల కోసం కప్ ను తీసుకురావాలని జట్టును కోరాడు. “కప్ ఎత్తడం మన కోసమే కాదు, మన వెనుక ఉన్న బిలియన్ల మంది ప్రజల కోసం. నా ప్రేమ, హృదయం ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. ఇప్పుడు కప్పును ఇంటికి తెచ్చుకుందాం. జై హింద్” అని పాండ్యా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Read Also: Aaditya Thackeray శివసేన నేత ఆదిత్య థాక్రేపై కేసు నమోదు
ఇదిలా ఉంటే.. హార్ధిక్ పాండ్యా బంగ్లాదేశ్ మ్యాచ్ లో గాయపడిన విషయం తెలిసిందే. దీంతో అప్పటినుంచి జట్టుకు దూరంగా ఉంటున్నాడు. పాండ్యా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు.