నిజామాబాద్ జిల్లాలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలువద్దనే కాంగ్రెస్ నుంచి షబ్బీర్ అలీ పోటీకి దిగారని తెలిపారు. మరోవైపు సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ పెద్ద మోసగాడు అని దుయ్యబట్టారు.
కొత్తగూడెం సీపీఐ కార్యాలయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం చావు నోట్లో తల పెట్టాను అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఖమ్మం ఆస్పత్రిలో వైద్యం చేయించుకొని జ్యూస్ తాగిన తర్వాత.. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు ఆగ్రహిస్తే మాట మార్చిన విషయం కేసీఆర్ మర్చిపోతే ఎలా అని విమర్శించారు.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు సెంటర్ లో కాంగెస్ పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు, సత్తుపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజక అభ్యర్థి డాక్టర్ రాగమయి దయానంద్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అన్నారు. డాక్టర్ రాగమయి దయానంద్ లు ప్రజా సేవ చేసిన నాయకులని తెలిపారు. కొంతమంది పారిశ్రామిక వేత్తలు సంచులతో…
నిర్మల్ జిల్లా ఖానాపూర్ లో ప్రజా ఆశీర్వదా సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయంటే అందరూ వచ్చి వాగ్దానాలు చేస్తూ ఉంటారు.. ఓటర్లు ఒక్కసారి ఆలోచించి ఓట్లు వేయాలని తెలిపారు. ఈ క్రమంలో.. కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ 58 సంవత్సరాల పాలనలో అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. అందుకోసం ప్రజలందరూ ఆలోచించాలన్నారు.
మెదక్ జిల్లా తూప్రాన్ లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభ నిర్వహించారు. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో మొదటి సారి బిజెపి ప్రభుత్వం ఏర్పాటు కానుందని తెలుగులో మాట్లాడారు. దుబ్బాక, హుజురాబాద్ లో ట్రైలర్ చూశారు...ఇక సినిమా చూస్తారని ప్రధాని మోదీ తెలిపారు. సకల జనుల సౌభాగ్య తెలంగాణ బీజేపీతోనే సాధ్యమన్నారు. న
12వ రోజు కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇల కైలాసంలో జరిగే అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి.. కోటి దీపోత్సవంలో జరిగిన కార్యక్రమాలను వీక్షించి లోకాన్నే మైమరిచిపోయేలా పునీతులయ్యారు.
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా.. నిజాంపేట్ హనుమాన్ ఆలయం కూడలి వద్ద భారతీయ జనతా పార్టీ కార్నర్ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుత్బుల్లాపూర్ ప్రజల ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. కుత్బుల్లాపూర్ లో బలమైన నాయకుడు శ్రీశైలం గౌడ్ అని అన్నారు.
నిన్న (శుక్రవారం) మాజీ ఐఏఎస్ ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 22లోని ఏకే గోయల్ ఇంట్లో ఎన్నికల బృందం, టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏకే గోయల్ మాట్లాడుతూ.. మా ఇంట్లో అక్రమ డబ్బు, మద్యం ఉన్నాయని ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేసేందుకు వచ్చారు, వారికి పూర్తిగా సహకరించానని తెలిపారు. తమ ఇంట్లో ఎలాంటి అక్రమ డబ్బు, మద్యం గుర్తించలేదని…
నిజామాబాద్ జిల్లా బాల్కొండ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి పాల్గొన్నారు. బాల్కొండ కాంగ్రెస్ అభ్యర్ధి ముత్యల సునిల్ రెడ్డి తరుఫున ఆమే ప్రచారం నిర్వహించారు. అందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. ఒక సైడ్ బీఆర్ఎస్ అవినీతి విజృంభిస్తుంది.. రెండో సైడ్ లో కాంగ్రెస్ పోరాడుతుందని తెలిపారు. కేసీఆర్ కి, ఆ పార్టీకి ప్రస్టేషన్ మొదలైంది.. ఓడిపోతున్నాం అని ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్వకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరినపుడే మన గౌరవం పెరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇక్కడ కట్టిన సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి కాంగ్రెస్ హయాంలో జరిగిందేనని రేవంత్ తెలిపారు.