MLA Kadiyam: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పాగాల సంపత్ రెడ్డి సంతాప సభలో పాల్గొన్న అనంతరం ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారు.. బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని తెలిపారు. కేసీఆర్ సింహాలా బయటకు వస్తారని.. సమయం చెప్పలేమని అన్నారు.
Read Also: 100 Websites Ban: కేటుగాళ్లకు చెక్..! వందకు పైగా వెబ్‌సైట్లపై నిషేధం
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 39 సీట్లొచ్చాయి, మన మిత్రులు ఎంఐఎం పార్టీకి 8 వచ్చాయని కడియం తెలిపారు. ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ వ్యతిరేకంగా ఉందని.. వారందరిని కలిపితే తమక 56 సీట్లు అవుతాయని కడియం చెప్పారు. సింహం రెండడుగులు వెనక్కి వేస్తోందంటే… వేటకు సిద్ధమైనట్టేనని తెలిపారు. కేసీఆర్ అనే సింహం త్వరలోనే బయటకు వస్తుంది.. ఎవరూ అధైర్యపడొద్దని కడియం శ్రీహరి ధైర్యం చెప్పారు.
Read Also: The coronal hole: సూర్యుడిపై అతిపెద్ద రంధ్రం.. 60 భూ గ్రహాలకు సమానం..