టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆకాశమే హద్దుగా కుప్పం ప్రజలు అభిమానం చూపిస్తున్నారని అన్నారు. ఈసారి కుప్పంలో లక్ష మెజారిటీ గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీకి పెయింటింగ్స్ మీదా ఉండే అభిమానం ప్రజల మీద లేదని ఆరోపించారు. జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాడా అని దుయ్యబట్టారు. జగన్ బటన్ నొక్కడంలో చిదంబరం రహస్యం ఉందని విమర్శించారు. సొంత పేపర్ కు యాడ్ ఇవ్వడానికి జగన్ బటన్ నొక్కుతున్నాడని చంద్రబాబు విమర్శలు…
విశాఖలో రేపు, ఎల్లుండి ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు అధికారులు. న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వాహనదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ సహా పలు రహదారులు మూసివేయనున్నారు. 31 రాత్రి 8గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు ఫ్లై ఓవర్ మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా.. హనుమంతవాక నుంచి అడవివరం జంక్షన్, గోశాల జంక్షన్ నుంచి వేపగుంట, పెందుర్తి జంక్షన్ నుంచి NAD జంక్షన్ మీదుగా కాన్వెంట్ జంక్షన్ వరకు మధ్య…
తమ ప్రభుత్వం మహిళలకు భద్రత కల్పిస్తున్నదని ఎంపీ నందిగం సురేష్ తెలిపారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. వైసీపీ ప్రభుత్వం అని అన్నారు. ఒకప్పుడు ఓటు వేయడానికి మాత్రమే ఎస్సీలు ఉండేవాళ్ళు.. ఈరోజు ఎస్సీలు హోంమంత్రులుగా పనిచేసే పరిస్థితి జగనన్న ప్రభుత్వంలో వచ్చిందని పేర్కొన్నారు. కర్మ గాలి చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు నిర్వీర్యం అయిపోతారని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో మనం ఉంటే మురికి కూపాలుగా మారతాయని కోర్టుల్లో చంద్రబాబు కేసులు వేశారని అన్నారు.
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాపు ద్రోహి జగన్ రెడ్డికి వంత పాడేందుకు శేషు సిగ్గుపడాలని దుయ్యబట్టారు. ఐదేళ్లలో కాపులకు ఏం చేశారో అడపా శేషు సమాధానం చెప్పగలడా? అని ప్రశ్నించారు. కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తే ప్రశ్నించలేని స్థితిలో అడపా శేషు ఉన్నాడని ఆరోపించారు. ఐదేళ్లలో కాపు కార్పొరేషన్ ద్వారా ఎంత మందికి రుణాలిచ్చారు..? అని ప్రశ్నించారు. ఎంత మందికి విదేశీ విద్య ఇచ్చారో అడపా శేషు చెప్పగలరా అని బోండా ఉమ…
ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ కేంద్ర సర్వీసులోకి వెళ్లనున్నారు. ఐదేళ్లపాటు డిప్యూటేషన్‌పై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) ఎస్పీగా విష్ణు వారియర్ సేవలందించనున్నారు. కాగా.. విష్ణు వారియర్‌ను స్టేట్ సర్వీస్ నుంచి వెంటనే రిలీవ్ చేయాలంటూ తెలంగాణ సీఎస్‌కు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాగా.. ప్రస్తుతం ఖమ్మం పోలీస్ కమిషనర్‌గా విష్ణు వారియర్ విధులు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే.
ప్రభుత్వ ఫలాలు ప్రజలకు అందేలా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమానికి రెండోరోజు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో రెండవ రోజు కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో నేడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొదటి రోజు ప్రజాపాలన ప్రజా సదస్సులలో ఎదురైన సమస్యలను పునరావృత్తం కాకుండా నేడు చర్యలు తీసుకోవడంపట్ల అభినందనలు తెలిపారు.
పాములు ఎంత ప్రమాదకరమో అందరికి తెలిసిన విషయమే.. సాధారణంగా పాములను చూస్తే భయపడే వారు చాలామంది ఉంటారు. ఎందుకంటే అవి కాటు వేయడం వల్ల చనిపోయే ప్రమాదం ఉంది కనుక.. వాటికి దూరంగా ఉంటారు. మరికొందరైతే పాములతో విన్యాసాలు చేస్తారు. మరీ ముఖ్యంగా ఈరోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమని ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి పాముకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో నాగుపామును చేతిలో ఉంచుకుని దాని చర్మాన్ని తీసేస్తున్నాడు. ఈ వీడియోను చూస్తే మనకు…
న్యూ ఇయర్ వేళ హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పదిరోజుల వ్యవధిలో ఫిలింనగర్ లో రెండోసారి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫిలింనగర్ లోని పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్నాడు ఓ వ్యక్తి. అతన్ని బెంగళూరుకు చెందిన క్యాప్ డ్రైవర్ బాబు కిరణ్ గా గుర్తించారు. డ్రగ్స్ అమ్ముతున్నాడనే సమాచారంతో పబ్ పార్కింగ్ వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు అధికారులు. మరోవైపు.. బాబు కిరణ్ నుంచి 20 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్…
బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మాని అభయ హస్తం హామీల అమలు గురించి ఆలోచించండని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా హామీల అమలుకు తేదీలు కూడా చెప్పారు.. ఆ తేదీలు గడిచిపోయినా ఇచ్చిన హామీల గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు. నిరుద్యోగ భృతి గురించి ఎన్నికల్లో చెప్పి.. ఎప్పుడు చెప్పామని భట్టి…
మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు తెలంగాణ మంత్రుల బృందం వెళ్లి సందర్శించారు. ఈ సందర్భంగా.. బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఐదుగురు మంత్రుల బృందం కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు.. అధికారులపై మంత్రులు ప్రశ్నలు వర్షం కురిపించారని తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల్లో 412 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది.. వాటికి నిధులు సమీకరించలేక శ్వేత పత్రాలు, న్యాయ విచారణల పేరిట డ్రామాలు…