Varla Ramaiah: డీజీపీకి నైతిక విలువలు ఉంటే రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ డీజీపీపై టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. డీజీపీ రాజేంద్రనాథరెడ్డి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఆయన వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన రాజేంద్రనాథరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనా..? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకులు.. రాజేంద్రనాథరెడ్డి అపాయింట్ మెంట్ కోరితే ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఇవ్వలేదని అన్నారు. మహిళా నాయకురాళ్లు వారి ఇబ్బందులు చెప్పుకోవాలనుకున్నా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. వైసీపీ వారు అపాయింట్ మెంట్ కోరితే గేటు వద్దకొచ్చి సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్తారు, ఇదెక్కడి న్యాయం? అని ప్రశ్నించారు.
Ambati Rayudu: వైసీపీలో చేరిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
వ్యూహం సినిమా డైరెక్టర్ సభ్యతా సంస్కారాలు లేని రాంగోపాల్ వర్మ అపాయింట్ మెంట్ అడిగితే డీజీపీ బయటికొచ్చి మరీ కార్యాలయంలోకి తీసుకెళ్లారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ లకు దున్నపోతు తలలు పెట్టి పోస్టర్ రిలీజ్ చేసిన వ్యక్తికి సాదర గౌరవమిస్తారా? అని దుయ్యబట్టారు. డీజీపీకి నైతిక విలువలు ఉంటే వెంటనే రాంగోపాల్ వర్మను అరెస్టు చేయాలని ఆయన కోరారు. కడుపు మండి కామెంట్ చేసిన యువకుడిని కాకుండా.. పొగరుతో కుల, మతాల మధ్య వైషమ్యాలు పెంచాలని పోస్టర్ రిలీజ్ చేసిన రాంగోపాల్ వర్మని అరెస్టు చేయాలన్నారు. అరాచకాలను సృష్టిస్తూ, శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యూహం సినిమాను విడుదల కానీయరాదన్నారు.
UP Shocker: పాటలు వినడానికి మొబైల్ అడిగినందుకు.. భర్త కంట్లో కత్తెరతో పొడిచేసిన భార్య
డీజీపీ వెంటనే సెంట్రల్ సెన్సార్ బోర్డుకు లేఖ రాయాలని వర్ల రామయ్య తెలిపారు. డీజీపీగా రాజేంద్రనాథరెడ్డి ఏకపక్ష వైఖరిని డీవోపీటీ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. డీజీపీ సరైన పోలీసు అధికారి అయితే వ్యూహం సినిమాను రిలీజ్ కాకుండా చూడాలన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే ‘‘ఎన్నికలయ్యాక మళ్లీ ఫ్యాక్షన్ మొదలుపెడతా’’ అనడం చట్టాలను శాసించేలా ఉందని తెలిపారు. అతన్ని వెంటనే అరెస్టు చేసి, బైండోవర్ చేయాలన్నారు. ప్రతిపక్ష నాయకులకు మీ ఆఫీసులో ప్రవేశం లేదా? వైసీపీ సభ్యత్వం ఉంటేనే రానిస్తారా? అని ప్రశ్నించారు. ఇకనైనా డీజీపీ బాధ్యతాయుతంగా నడుచుకుంటూ, చట్టబద్ధంగా వ్యవహరిస్తూ.. సమధర్మం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయాలని తెలిపారు. డీజీపీ మీ హయాంలో స్వర్ణాంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్ గా మారిందని ఆరోపించారు. తాను ఫ్యాక్షనిస్టుగా మారుతానన్న ఎమ్మెల్యే పెద్దారెడ్డిని వెంటనే అరెస్టు చేసి బైండోవర్ చేయాలని వర్ల రామయ్య కోరారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!