Suicide Attempt: చావు బతుకుల్లో రిషబ్ పంత్‌ను కాపాడిన యువకుడు.. కారణమేంటంటే..?
- రిషబ్ పంత్ ప్రాణాలను కాపాడిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం
- చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్న రజత్
- ప్రేమ వ్యవహారమే కారణం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ 2022 డిసెంబర్ 30న కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.. పంత్ ఢిల్లీ నుంచి రూర్కీ తన ఇంటికి వెళ్తుండగా.. డెహ్రాడూన్ హైవేపై అతని కారు ప్రమాదానికి గురైంది. అయితే.. హైవేపై ప్రయాణిస్తున్న కొంతమంది వ్యక్తులు పంత్ ప్రాణాలను కాపాడారు. అయితే.. పంత్ ప్రాణాలను కాపాడిన వ్యక్తులలో రజత్ అనే యువకుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతను చావు బతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నాడు.
Read Also: Swati Maliwal: దోపిడీ కోసం కేజ్రీవాల్ తన ‘‘గుండా’’ని పంజాబ్ పంపాడు..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఆ యువకుడు అతని ప్రేమికురాలితో సంబంధం విషయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. అతని ప్రేమికురాలు మను కశ్యప్, రజత్ 5 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. అయితే.. వారి కుటుంబాలు వేర్వేరు వర్గాలు కావడంతో వారి ప్రేమను అంగీకరించలేదు. అంతేకాకుండా.. వారి పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో.. గత మూడు రోజుల క్రితం ఈ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం బాలిక తల్లి తన కూతురికి విషం ఇచ్చి చంపేశాడని ఆ యువకుడిపై ఆరోపించింది. అయితే ప్రేమలో వైఫల్యం కారణంగా వారిద్దరూ ఈ చర్య తీసుకున్నారని పోలీసులు తెలిపారు. పుర్కాజీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుచ్చా బస్తీ గ్రామంలో నివసించే 21 ఏళ్ల మను కశ్యప్, షెడ్యూల్డ్ కులానికి చెందిన 25 ఏళ్ల రజత్ ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వారు వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో, వారి కుటుంబాలు పెళ్లికి అంగీకరించలేదు. అంతేకాకుండా.. వారి పేరెంట్స్ తమ పెళ్లి కోసం ప్లాన్ కూడా చేశారు. ఈ క్రమంలో.. వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
Read Also: Aghathiyaa Trailer: “120 ఏళ్ల క్రితం ఆత్మలని కలవాలనుకుంటున్నారా?” ‘అగత్యా’ ట్రైలర్ చూసేయండి..
కాగా.. రజత్, అతని స్నేహితుడు నిషు.. పంత్ రోడ్డు ప్రమాదం బారిన పడినప్పుడు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లడంలో సహాయం చేశారు. కాగా.. తనను ఆస్పత్రిలో చేర్పించి కాపాడినందుకు పంత్ వారిద్దరికీ ఒక స్కూటర్‌ను బహుమతిగా ఇచ్చాడు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!