Tooth Brush: మీ టూత్ బ్రష్‌ను ఎక్కువ కాలం వాడుతున్నారా..? ప్రమాదం పొంచి ఉన్నట్టే..
- శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు నోటి ఆరోగ్యం కూడా ముఖ్యం
- నోటి ఆరోగ్యం పర్యవేక్షించడం ద్వారా ఆరోగ్య సమస్యలు చెక్ పెట్టొచ్చు
- నోటి ఆరోగ్యానికి కొన్ని జాగ్రత్తలతో మొత్తం శరీరానికి లాభం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆరోగ్యంగా ఉండటం అంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మాత్రమే కాదు. మన నోటి ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమైనది. మన నోటి ఆరోగ్యం పర్యవేక్షించడం ద్వారా మనం వివిధ ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. అయితే నోటి ఆరోగ్యానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొత్తం శరీరానికి లాభం కలుగుతుంది. శరీరంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, అది నోటి ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కాబట్టి నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం, అలాగే సరిగ్గా టూత్ బ్రషింగ్ చేయడం అత్యంత ముఖ్యమైనది.
నోటి ఆరోగ్యానికి సమర్ధమైన టూత్ బ్రషింగ్:
నోటి పరిశుభ్రత కోసం క్రమం తప్పకుండా టూత్ బ్రష్ చేయడం, దానికి సరైన టూత్‌పేస్ట్‌ను ఉపయోగించాలి. అంతే కాకుండా.. మనం ఉపయోగించే టూత్ బ్రష్ కూడా నిత్యం పరిశుభ్రంగా, గమనించదగిన మార్పులను చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం చాలా సార్లు చాలా పాత టూత్ బ్రష్‌లను ఎక్కువ రోజులు ఉపయోగిస్తుంటాము. దీనికి కారణం డబ్బు ఆదా చేయడం లేదా అలవాటు కారణంగా.. అయితే అది నోటి ఆరోగ్యానికి తీవ్ర హానికరంగా మారవచ్చు.
Also Read
- TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
- Women's Health : 40 ఏళ్లకే మెనోపాజ్.? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
- Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే 'రాగి బిస్కెట్లు'.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
- Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
టూత్ బ్రష్ మార్పులు:
ప్రతి 3 నుండి 4 నెలలకు ఒకసారి టూత్ బ్రష్‌ను మార్చుకోవడం చాలా ముఖ్యం. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC), ఇండియన్ డెంటల్ అసోసియేషన్ (IDA) ప్రకారం.. టూత్ బ్రష్‌ని తరచుగా మార్చడం అనేది కేవలం సమర్ధమైన బ్రషింగ్ కొరకు మాత్రమే కాకుండా.. బ్యాక్టీరియా, సూక్ష్మజీవుల వ్యాప్తిని నివారించడానికి కూడా ఎంతో అవసరం అని తెలిపింది.
టూత్ బ్రష్‌ను ఎప్పుడు మార్చాలి..?
బ్రిస్టల్స్ వంకరగా మారితే: కొన్ని సార్లు టూత్ బ్రష్ వంకరగా మారడం లేదా బ్రిస్టల్స్ వదులుగా అవడం సాధారణం. ఇవి బ్రషింగ్ పనితీరు పరిగణనలో లేకుండా దంతాలను శుభ్రం చేయడంలో అసమర్థత కలిగిస్తాయి.
బ్రష్ ముళ్ళగరికెలు విరిగిపోతే: టూత్ బ్రష్‌లోని ముళ్ళగరికెలు విరిగిపోయినప్పుడు వెంటనే టూత్ బ్రష్‌ను మార్చండి. ముళ్ళగరికెలు దంతాలను శుభ్రం చేయలేవు.
మీరు బలంగా బ్రష్ చేస్తే: టూత్ బ్రష్ ని ఎక్కువగా ఒత్తిపట్టి, గట్టిగా బ్రష్ చేస్తూ ఉంటాము. ఇది బ్రష్ యొక్క బ్రిస్టల్స్ను త్వరగా దెబ్బతీస్తుంది. అలాగే దంతాలకు కూడా నష్టం కలిగిస్తుంది. ఇలా ఎక్కువగా ఒత్తిపట్టి బ్రష్ చేయడం వల్ల నోటి సబ్బతులను కూడా పెంచవచ్చు.
ఆరోగ్య సమస్యలు ఉంటే: మీరు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు దాని వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. అనారోగ్యం సమయంలో మీరు ఉపయోగించే టూత్ బ్రష్‌ను మార్చడం అవసరం అవుతుంది.
ఎలక్ట్రిక్ టూత్ బ్రష్: మీరు ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ఉపయోగిస్తుంటే.. బ్రష్ హెడ్‌ను ప్రతి 3 నుండి 5 నెలలకోసారి మార్చడం అవసరం. ఎలక్ట్రిక్ టూత్ బ్రష్‌ల్లో కలిగి ఉండే రంగు సూచికలు ఈ మార్పును సమయం కావాలని సూచిస్తాయి.
మీ టూత్ బ్రష్‌ని జాగ్రత్తగా గమనించండి: మీ టూత్ బ్రష్ చాలా ఉపయోగపడే ఒక సాధనంగానే కాకుండా.. ఇది నోటి పరిశుభ్రత కోసం చాలా కీలకమైన భాగం. అందువల్ల.. టూత్ బ్రష్ మార్చడం కూడా ఒక సిలికన్ రూల్. కావున, టూత్ బ్రష్‌ను చాలా కాలం ఉపయోగించకపోవడం మంచిది. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మీరు మంచి నోటి ఆరోగ్యం కాపాడుకోవచ్చు. మొత్తంగా మనకు మంచి ఆరోగ్యం కావాలంటే, కేవలం శారీరక ఆరోగ్యం మాత్రమే కాకుండా.. నోటి ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవడం ఎంతో అవసరం.
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!