లక్నో సూపర్ జెయింట్స్ కొత్త జెర్సీని రివీల్ చేసింది. రేపు (ఆదివారం) కోల్కతా నైట్ రైడర్స్తో జరగనున్న మ్యాచ్ లో ఆ జట్టు ఆటగాళ్లు ఈ మెరూన్ రంగు జెర్సీలో కనిపించనున్నారు. కోల్ కతాలోని ప్రముఖ ఫుట్ బాల్ క్లబ్ మోహన్ బగాన్కు గౌరవార్థంగా లక్నో ఆటగాళ్లు ఈ స్పెషల్ జెర్సీ వేసుకోనున్నారు. మోహన్ బగాన్ క్లబ్ యజమాని సంజీవ్ గోయెంకా.. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నోకు యజమానిగా ఉన్నారు.
బీహార్‌లో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ముంగేర్ జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 14 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. మద్యం మత్తులో తండ్రి కూతురిని హత్య చేశాడు. అనంతరం.. ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని ఇంట్లో దాచిపెట్టాడు. రాత్రి సమయంలో మృతదేహాన్ని బయట పడేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే.. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘటనాస్థలానికి చేరకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు..…
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ టీమ్ను ఎంపిక చేశారు. వాస్తవానికి.. ఐపీఎల్ ముగియగానే, వెస్టిండీస్-అమెరికాలో టీ20 ప్రపంచకప్ ఉండనుంది. అందుకోసం ఏప్రిల్ నెలాఖరులోగా టీమిండియాను ఎంపిక చేయనున్నారు. 2013 తర్వాత టీమిండియా.. ఐసీసీ ట్రోఫీ ఒక్కటి కూడా అందుకోలేదు. ఈ క్రమంలో.. ఈ ట్రోఫీని సొంతం చేసుకోవడానికి టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. అందుకోసం.. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్‌లో అత్యుత్తమ ప్రదర్శన చూపించి.. టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో.. టీ20 ప్రపంచకప్‌లో భారత…
యూపీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ అన్న.. ఇద్దరు చెల్లెల్లు మృతి చెందారు. మరో బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ప్రమాదం.. గ్రేటర్ నోయిడాలోని ప్యారీ చౌక్ సమీపంలో జరిగింది. నలుగురు కలిసి బైక్ పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురు మృతి చెందారు. వీరంతా.. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు…
వరల్డ్ ఓల్డెస్ట్ అవిభక్త కవలలుగా ప్రపంచ రికార్డు సృష్టించిన లోరీ, జార్జ్ షాపెల్ కన్నుమూశారు. 62 ఏళ్ల వయసులో వీరు మరణించారు. అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. వీరి మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ఏప్రిల్ 7న వీరు చనిపోగా.. తాజాగా ఈ విషయం బయటకు వచ్చింది.
ఐపీఎల్ 2024లో భాగంగా.. ఈరోజు పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. చంఢీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్లో యజువేంద్ర చాహల్ సరికొత్త రికార్డును సృష్టించబోతున్నాడు. పంజాబ్ తో జరిగే మ్యాచ్లో చాహల్ 3 వికెట్లు పడగొడితే ఐపీఎల్ చరిత్రలోనే 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు నెలకొల్పనున్నాడు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యాన్ని చేధించి ఢిల్లీ రికార్డులకెక్కింది. లక్నో 160+ స్కోరుపై గెలవడం ఇదే మొదటిసారి. 160 ప్లస్ పరుగులు అంటే.. లక్నోకు విజయం ఖాయమని అందరూ భావిస్తారు. కానీ.. ఢిల్లీ ఆ చరిత్రను తిరగరాసింది.
ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలుపొందింది. 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో చేధించింది.
బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్కి మద్దతుగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రచారంలో పాల్గొన్నారు. మంకమ్మ తోట నుంచి రాంనగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మాజీ మంత్రి గంగుల, ఎంపీ అభ్యర్థి వినోద్ పాల్గొన్నారు. కరీంనగర్లో ఎమ్మెల్యే హరీష్ రావు డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. కరీంనగర్లో చదువుకున్న విద్యార్ధిని నేను.. జరిగిన అభివృద్ధి చుస్తే నా రెండు కళ్ళు సరిపోతలేవన్నారు. బీఆర్ఎస్కు కరీంనగర్ పుట్టినిల్లు వంటిది.. కేసీఆర్ కేంద్రమంత్రిగా…
ఐపీఎల్ 2024లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఫైటింగ్ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. ఢిల్లీ ముందు 168 పరుగుల టార్గెట్ ను ముందుంచింది. లక్నో బ్యాటింగ్ లో అత్యధికంగా ఆయుష్ బదోని (55) పరుగులు చేసి జట్టుకు కీలక రన్స్ చేసి సాధించిపెట్టాడు. 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్ లో ఒక సిక్స్, 4 ఫోర్లు ఉన్నాయి.