ఐపీఎల్ 2024లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. 168 పరుగుల లక్ష్యాన్ని చేధించి ఢిల్లీ రికార్డులకెక్కింది. లక్నో 160+ స్కోరుపై గెలవడం ఇదే మొదటిసారి. 160 ప్లస్ పరుగులు అంటే.. లక్నోకు విజయం ఖాయమని అందరూ భావిస్తారు. కానీ.. ఢిల్లీ ఆ చరిత్రను తిరగరాసింది.
Read Also: Balakrishna: మరోసారి అభిమానిపై చేయి చేసుకున్న బాలయ్య
ఇకపోతే.. నిన్నటి మ్యాచ్లో చివరి వరకు ఉత్కంఠపోరు కొనసాగింది. ఆడిన తొలి మ్యాచ్లోనే ప్రత్యర్థులను చీల్చి చెండాడు జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్. దీంతో ఢిల్లీ విజయం నమోదు చేసుకుంది. ఇకపోతే.. ఈ మ్యాచ్ లో లక్నో స్టార్ బౌలర్ మయాంక్ యాదవ్ లేని లోటు కనపడింది. అతను ఉండుంటే.. ఫటాఫట్ వికెట్లు తీసి విజయాన్ని అందించేవాడు. కానీ.. ఇంజ్యూరీ కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు.
Read Also: Thug Life: ఆఖరికి సిద్దార్థ్ కూడానా.. అసలు ఏం జరుగుతోంది భయ్యా?
నిన్నటి మ్యాచ్లో ఓటమి అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. యంగ్ బౌలర్ మయాంక్ యాదవ్ పరిస్థితి దారుణంగా ఏమీ లేదన్నారు. వందశాతం ఫిట్నెస్ ఉంటేనే ఆడించాలని అనుకున్నట్లు చెప్పారు. మయాంక్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. మరో రెండు మ్యాచ్లకు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపారు. తిరిగి జట్టులోకి వస్తే అత్యుత్తమ ప్రదర్శన చేస్తాడనే నమ్మకం ఉందని రాహుల్ తెలిపారు.