మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ బస్సు యాత్రతో కాంగ్రెస్ వాళ్లు గజగజ వణుకుతున్నారని అన్నారు. ఢిల్లీకి వెళ్లి మోడీతో రేవంత్ రెడ్డి ములాఖత్ అయ్యాడని తెలిపారు.
నాలుగున్నర నెలల కాంగ్రెస్ పాలనలో తిట్లు లేకపోతే దేవుని మీద ఒట్టు అని అన్నారు. ఆరు గ్యారెంటీలు, 2 లక్షల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా అని తాను చెప్పానని..
అమరవీరుల స్తూపం దగ్గరికి రమ్మంటే తోక ముడిచి రేవంత్ రాలేదని దుయ్యబట్టారు.
PM Modi: నేహ మర్డర్‌పై స్పందించిన ప్రధాని.. ఓట్ బ్యాంక్ రాజకీయాలని కాంగ్రెస్‌పై ఫైర్..
కాంగ్రెస్ పై కోపంతో బీజేపీకి ఓటేస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డ పరిస్థితి అవుతుందని విమర్శించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లు అరచేతిలో వైకుంఠం చూపించి గెలిచారని వ్యాఖ్యానించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ కి నమ్మి ఓటేస్తే నీళ్లు లేని బావిలో దూకినట్టేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వాళ్లు గ్రామాల్లో ప్రచారానికి వస్తే తరిమికొట్టండని సూచించారు.
Viral Video: దూల తీరిందిగా.. ఇప్పుడు ఆ పెళ్లికూతురు పరిస్థితి ఎలా ఉందో మరి..
వడ్లలో తరుగు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి ఓట్లలో తరుగు పెట్టాలన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు బావి దగ్గర 24 గంటల కరెంట్ వస్తే, కాంగ్రెస్ వచ్చాక 14 గంటలు వస్తుందని హరీష్ రావు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ పాలనలో మోటార్లు కాలిపోతున్నాయన్నారు. పదేళ్లు ఢిల్లీలో ఉన్న బీజేపీ తెలంగాణకి ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ హయాంలో గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగాయని ఆరోపించారు.
4 వేల పెన్షన్ వచ్చినోళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి.. రానోళ్లు బీఆర్ఎస్ కి ఓటెయ్యండని అన్నారు.
మహాలక్ష్మి పథకం అని మహిళల్ని మోసం చేశారని హరీష్ రావు పేర్కొన్నారు.