PM Modi: జగన్నాథ ఆలయంలో ప్రధాని మోడీ పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ఒడిశాలో పర్యటించారు. ఈ సందర్భంగా.. పూరీలోని ప్రసిద్ధ జగన్నాథ ఆలయంలో ప్రార్థనలు చేశారు. అనంతరం ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. “పూరీలో మహాప్రభు జగన్నాథుడిని ప్రార్థించాను. ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ మాపై ఉండాలి మరియు మమ్మల్ని పురోగతి యొక్క కొత్త శిఖరాలకు తీసుకువెళ్లాలని” తెలిపారు. పూజలు నిర్వహించిన తర్వాత.. మార్చికోట్ చౌక్ నుండి పూరీలోని మెడికల్ స్క్వేర్ వరకు రెండు కిలోమీటర్ల రోడ్ షోలో పాల్గొన్నారు. బీజేపీ పూరీ లోక్‌సభ అభ్యర్థి సంబిత్ పాత్రతో కలిసి రోడ్ షో నిర్వహించారు.
Fire Break : పెట్రోల్ బంక్ లోనే పేలిన లారీ డిజీల్ ట్యాంక్.. అతడే లేకుంటే..
Also Read
ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. రత్న భాండార్ (ట్రెజరీ ఫండ్) తాళాలు మిస్ కావడంపై అధికార బీజేడీ (BJD) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 25 ఏళ్లుగా బిజూ జనతా దళ్(బీజేడీ) ప్రభుత్వం ఉన్నా రాష్ట్రం ఏ మాత్రం అభివృద్ధి చెందలేదని విమర్శించారు. బీజేడీ హయాంలో పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం కూడా సురక్షితం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడ్డాక అన్ని సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని వెల్లడించారు. గత పదేళ్లలో దేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో దేశ ప్రజలంతా చూశారన్నారు. 21వ శతాబ్దపు ఒడిశా అభివృద్ధిలో వేగం కావాలని, అది కేవలం బీజేపీ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
Terrorists: అహ్మదాబాద్ ఎయిర్పోర్టులో పట్టుబడ్డ నలుగురు ఉగ్రవాదులు శ్రీలంక వాసులుగా గుర్తింపు..
గత 10 రోజుల్లో ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించడం ఇది రెండోసారి. ఒడిశాలో ఎన్నికల ముందు బీజేపీ, బీజేడీ పొత్తు పెట్టుకున్నాయి. ఆ తర్వాత విఫలమవడంతో ఆ పార్టీల మధ్య పోరు మరింత ముదిరింది. 2009లో తమ భాగస్వామ్యాన్ని ముగించడానికి ముందు బీజేపీ-బీజేడీ తొమ్మిదేళ్ల పాటు ఒడిశాను పొత్తుతో పాలించాయి.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!