2024 ఎన్నికల్లో విజయం సాధించి.. తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెడుతున్న సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నారు. అందులో కంగనా రనౌత్ నుండి అరుణ్ గోవిల్ వంటి ప్రముఖులు మొదటి సారిగా 18వ లోక్‌సభలో కాలుమోపనున్నారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి దేశంలో ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు జరిగాయి. కాగా.. ఈసారి జరిగిన ఎన్నికల్లో పలువురు ప్రముఖులు విజయం సాధించి పార్లమెంటులోకి రావడానికి సిద్ధమయ్యారు.
Read Also: Germany floods: జర్మనీని ముంచెత్తిన భారీ వరదలు.. ఐదుగురు మృతి
కొత్తగా పార్లమెంటులో అడుగుపెట్టే సినీ ప్రముఖులు ఎవరంటే..
కంగనా రనౌత్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఈమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలాకాలం నుంచి మద్దతు తెలిపింది. ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం ఆమెకు తన సొంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుండి పోటీ చేసే అవకాశమిచ్చింది. ఈ అవకాశాన్ని కంగనా సద్వినియోగం చేసుకుంది. మొట్టమొదటి సారిగా ఎన్నికల్లో విజయం సాధించింది. ఆరుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వీరభద్ర సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్‌పై కంగనా రనౌత్ విజయం సాధించింది.
Read Also: Annamalai: తమిళనాడులో బీజేపీ ఫలితాలపై అన్నామలై కీలక వ్యాఖ్యలు..
“రామాయణ్” స్టార్ అరుణ్ గోవిల్ కూడా బీజేపీ నుంచి పోటీ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సునీతా యాదవ్‌పై ఆయన విజయం సాధించారు. అయితే.. ఆయన కేవలం 10,585 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. హిందీ సినిమా ఇండస్ట్రీకి చెందిన మరో ప్రముఖ నటి హేమ మాలిని.. తన సమీప ప్రత్యర్థి అయిన కాంగ్రెస్‌కు చెందిన ముఖేష్ ధన్‌గర్‌పై మథుర నుండి లోక్‌సభకు నేరుగా మూడవసారి ఎన్నికయ్యారు. మరోవైపు.. మాజీ భోజ్‌పురి సినీ నటుడు, గాయకుడు మనోజ్ తివారీ నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుండి బీజేపీ తరుఫున పోటీ చేసి కాంగ్రెస్ ప్రత్యర్థి కన్హయ్య కుమార్‌పై గెలుపొందారు. ఈ స్థానం నుంచి తివారీకి ఇది వరుసగా మూడో విజయం. 18వ లోక్‌సభ ఎన్నికలకు ఢిల్లీ నుంచి బీజేపీ నిలబెట్టుకున్న ఏకైక సిట్టింగ్ ఎంపీ ఈయనే.
Mahesh Babu: బాబు, పవన్ గెలుపు.. మహేష్ బాబు ఆసక్తికర ట్వీట్లు
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నుండి మరో ప్రముఖ భోజ్‌పురి సినీ నటుడు, బీజేపీ అభ్యర్థి రవి కిషన్ వరుసగా రెండవసారి గెలుపొందారు. తన నియోజకవర్గాన్ని నిలబెట్టుకోవడానికి సమాజ్‌వాదీ పార్టీ నుంచి కాజల్ నిషాద్‌ను ఓడించారు. కేరళలోని త్రిసూర్ నియోజక వర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నటుడు సురేష్ గోపి గెలుపొందారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు చెందిన విఎస్ సునీల్‌కుమార్‌ను ఓడించారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హా తన సమీప ప్రత్యర్థి బీజేపీకి చెందిన ఎస్‌ఎస్ అహ్లువాలియాపై విజయం సాధించారు.
Top Universities In World: ప్రపంచ టాప్ యూనివర్సిటీల్లో భారత ఐఐటీలు..
ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంలో మాజీ నటి, బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి కిషోరిలాల్ శర్మ చేతిలో విజయం సాధించలేకపోయింది. నటుడు, బీజేపీ నాయకుడు దినేష్ లాల్ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లోని అజంగఢ్ సీటులో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ పై గెలిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని పిఠాపురం అసెంబ్లీ స్థానంలో సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగగీతపై విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్‌లోని మేదినీపూర్‌లో టిఎంసికి చెందిన బెంగాలీ నటుడు, రాజకీయవేత్త జూన్ మాలియా బిజెపికి చెందిన అగ్నిమిత్ర పాల్‌పై విజయం సాధించారు. నటి, టిఎంసి అభ్యర్థి రచనా బెనర్జీ హుగ్లీ నుంచి బిజెపికి చెందిన నటుడు లాకెట్ ఛటర్జీపై విజయం సాధించారు.