తెలంగాణ ఇంజనీరింగ్ మొదటి విడత సీట్లు కేటాయించారు. కన్వీనర్ కోటాలో 78, 694 సీట్లు ఉండగా 75, 200 సీట్లు కేటాయించారు. అంటే 95.6 శాతం సీట్లు కేటాయించారు. 89 కాలేజీలో వంద శాతం సీట్లు కేటాయించారు. ఇందులో 7 యూనివర్సిటీ కాలేజీలు, 82 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సుల్లో53, 890 సీట్లు ఉంటే 53, 517 సీట్లు కేటాయించారు. అంటే.. 99.31 శాతం సీట్లు కేటాయించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కోర్సుల్లో16, 344 సీట్లు ఉంటే 15, 127 సీట్లు కేటాయించారు. అంటే.. 92.55 శాతం సీట్లు కేటాయించారు.
Read Also: Karnataka video: ఇళ్ల మధ్యకు వచ్చేసిన భారీ కింగ్ కోబ్రా.. బెంబేలెత్తిపోయిన ప్రజలు
సివిల్, మెకానికల్ కోర్సుల్లో7, 339 సీట్లు ఉంటే 5, 689 సీట్లు కేటాయించారు. అంటే.. 77.52 శాతం కేటాయించారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా కంప్యూటర్ సైన్స్, అనుబంధ కోర్సులకు విద్యార్థులు జై కొట్టారు. అయితే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కోర్సులను కూడా విద్యార్థులు ఎంపిక చేసుకున్నారు. గతంతో పోల్చుకుంటే మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో కూడా సంఖ్య పెరిగింది.
జెండర్ వైస్, కేటగిరీ వైస్ సీట్లు అలాట్మెంట్ డీటెయిల్స్
ఇంజనీరింగ్ సీట్లు అలాట్ అయినవారిలో 41,308(55 శాతం) బాయ్స్, 33,892 (45 శాతం) గర్ల్స్ ఉన్నారు.
ఇంజనీరింగ్ సీట్లు అలాట్ అయిన వారిలో 20.4 శాతం ఓసీ(oc)లు, 52.6 శాతం బీసీలు, ఎస్సీలు 16.8 శాతం, ఎస్టీ లు 10.2 శాతం ఉన్నారు.
Read Also: Allu Family Vs Mega Family: అల్లు అర్జున్ నంద్యాల ప్రచారం.. మెగా ఫ్యామిలీతో వివాదంలో నిజమిదే!
తెలంగాణ ఈఏపీసెట్ 2024 తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జులై 4 నుంచి ప్రారంభమైంది. జులై 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి.. ధ్రువపత్రాల పరిశీలనకు ఎప్పుడు హాజరవుతారో స్లాట్ బుక్ చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 6 నుంచి 13 వరకు 36 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ఏదో ఒకచోట సర్టిఫికెట్స్ పరిశీలనకు హాజరయ్యారు. పరిశీలన చేయించుకున్న వారు ఈ నెల 8 నుంచి 15 వరకు వారికి తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను ఎంచుకునేందుకు వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారికి ఈ నెల 19వ తేదీ తొలి విడత సీట్లు కేటాయించనున్నారు. కాగా.. షెడ్యూల్ ప్రకారం.. రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 26 నుంచి ప్రారంభంకానుంది. అలాగే.. చివరి దశ కౌన్సెలింగ్ ఆగస్టు 8 నుంచి ప్రారంభమవుతుంది.