Damodara Rajanarsimha: నగదు రహిత చెల్లింపుల రద్దు నిర్ణయం ఉపసంహరణ..
- ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ.. EHS.. ఆరోగ్య భద్రత కార్డులపై..
- నగదు రహిత సేవలను కొనసాగిస్తాం- తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్
- బకాయిలు ఆలస్యం అవుతున్నందున జూలై 20వ తేదీ లోగా బకాయిలు చెల్లించని ఎడల..
- నగదు రహిత సేవలను రద్దు చేసుకుంటామని తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ హెచ్చరిక
- తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలోనే బకాయిలు అందజేస్తామన్న మంత్రి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచనల మేరకు రాష్ట్రవ్యాప్తంగా స్పెషాలిటీ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత కార్డులపై నగదు రహిత సేవలను కొనసాగిస్తామని తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా.. పేద, మధ్యతరగతి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు, పోలీసు సిబ్బందికి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్లో నగదు రహిత సేవలు అందిస్తోంది. అయితే ఆ సేవలకు చెల్లించాల్సిన బకాయిలు ఆలస్యం అవుతున్నందున జూలై 20వ తేదీ లోగా బకాయిలు చెల్లించని ఎడల నగదు రహిత సేవలను రద్దు చేసుకుంటామని చేసిన హెచ్చరికపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తక్షణం స్పందించారు.
Jitin Prasada : రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రికి గాయాలు..ఇప్పుడెలా ఉందంటే..?
Also Read
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
- Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
- Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి దామోదర్ రాజనర్సింహ చర్చించారు. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా చెల్లించాల్సిన గత బకాయిలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలోనే అందజేస్తామన్నారు. అలాగే.. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా స్పెషాలిటీ హాస్పిటల్స్ అందిస్తున్న నగదు రహిత సేవలకు క్రమం తప్పకుండా నెలవారీగా చెల్లింపులు జరిగేలా కృషి చేస్తామని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆస్పత్రుల అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
Bangladesh: ఉద్రిక్తంగా బంగ్లాదేశ్.. ప్రపంచానికి దూరంగా ఆ దేశం..
మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్.. ఈనెల 20వ తేదీ నుండి నగదు రహిత చెల్లింపుల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. అలాగే.. నిరంతరం నగదు రహిత సేవలను కొనసాగిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు లేఖను మంత్రి దామోదర్ రాజనర్సింహకి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ నరసింహ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు ద్వారా అందిస్తున్న.. నగదు రహిత సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మెరుగైన వైద్య సేవలను నిరంతరం అందించాల్సిందిగా తెలంగాణ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ను కోరారు.
తాజావార్తలు
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
-
BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?