Power Purchase: విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండ..
- విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండ
- ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ డిస్కంలను విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయకుండా నిలిపివేసిన పవర్ ఎక్ఛేంజీలు
- చత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన..
- రూ. 261 కోట్లు తెలంగాణ చెల్లించాలని ఫిర్యాదు చేసిన పవర్ గ్రిడ్ కార్పొరేషన్
- తెలంగాణ డిస్కంలను విద్యుత్తు బిడ్లలో పాల్గొనకుండా అడ్డుకున్న నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్
- గత్యంతరం లేకపోవటంతో హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్ర విద్యుత్ సంస్థల నెత్తిన మరో గుదిబండ పెట్టాయి. ఈరోజు ఉదయం నుంచి తెలంగాణ డిస్కంలను విద్యుత్తు కొనుగోలుకు బిడ్లు వేయకుండా పవర్ ఎక్ఛేంజీలు నిలిపివేశాయి. చత్తీస్గఢ్ విద్యుత్తు కొనుగోలుకు సంబంధించిన రూ. 261 కోట్లు తెలంగాణ చెల్లించాలని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా తెలంగాణ డిస్కంలను విద్యుత్తు బిడ్లలో పాల్గొనకుండా నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ అడ్డుకున్నాయి. దీంతో.. గత్యంతరం లేకపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది.
Read Also: Road Accident: ఘోర ప్రమాదం.. అదుపు తప్పి కారుపై పడిన కంటైనర్, నలుగురు మృతి
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
కాగా.. చత్తీస్గఢ్ నుంచి విద్యుత్తును తెచ్చుకునేందుకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తో విద్యుత్తు సరఫరాకు గత ప్రభుత్వం కారిడార్ బుక్ చేసుకుంది. ఈ కారిడార్ వివాదం ఇప్పుడు తెలంగాణ డిస్కంల మెడకు చుట్టుకుంటుందని విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. చత్తీస్గఢ్ నుంచి విద్యుత్తు లభించే అవకాశం లేదని ఈ కారిడార్ ను గత ప్రభుత్వం అర్ధాంతరంగా రద్దు చేసుకుంది. అవసరం లేకున్నా.. గత ప్రభుత్వం కారిడార్లను ముందుగానే బుక్ చేసుకోవడంతో ప్రస్తుతం డిస్కమ్స్ పై ఆర్థిక భారం పడుతుంది. వాడినా వాడకున్నా.. పరిహారం కింద రూ. 261 కోట్లు కట్టాలని పీజీసీఐఎల్ తెలంగాణ డిస్కంలకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ వివాదంపై సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌ను తెలంగాణ డిస్కంలు ఆశ్రయించాయి. వివాదం సీఈఆర్సీ పరిధిలో ఉండగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వినిపించనుంది.
Read Also: MP: మధ్యప్రదేశ్‌లో ఘోరం.. ఇంటి గోడ కూలి ఏడుగురు మృతి
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!