శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో ఇన్నింగ్స్‌లో డీఆర్‌ఎస్ తీసుకోకుండా విరాట్ కోహ్లీ పెద్ద తప్పు చేశాడు. చెన్నై వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 36 బంతుల్లో 17 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో.. మెహదీ హసన్ మిరాజ్ వేసిన ఫుల్ డెలివరీ తప్పి బంతి ప్యాడ్‌కు తగిలింది. ఆలస్యం చేయకుండా అంపైర్ అప్పీల్‌ను అంగీకరించి ఔట్ ఇచ్చాడు. ఆ సమయంలో.. తోటి బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌తో మాట్లాడి రివ్యూ తీసుకోకూడదని కోహ్లీ నిర్ణయించుకున్నాడు. దీంతో.. పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత రీప్లేలలో చూపిస్తూ, బంతి బ్యాట్ అంచున పడినట్లు స్పష్టంగా కనపడింది. ఇది చూసి కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యపోయాడు.
Hezbollah: ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హిజ్బుల్లా కీలక కమాండర్ ఇబ్రహీం అకిల్ హతం..
అనంతరం.. రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఆ సమయంలో స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై విరాట్ కోహ్లి ఔట్ అయిన రీప్లే వేశారు. అందులో బంతి అతని బ్యాట్‌కు కొద్దిగా అంచుతో ప్యాడ్‌కు తగిలింది. ఇది చూసిన అభిమానులతో పాటు కామెంటేటర్లు, డగౌట్‌లో కూర్చున్న రోహిత్ శర్మ వరకు అందరూ ఆశ్చర్యపోయారు. బ్యాట్‌కు తగిలిందని కెప్టెన్ రోహిత్ శర్మ కోహ్లీకి.. అక్కడ ఉన్న జట్టు సభ్యులకు చెప్పాడు. కోహ్లీ ఎందుకు డీఆర్ఎస్ తీసుకోలేదంటూ డ్రెస్సింగ్ రూములో రోహిత్ శర్మ కోప్పడుతూ కనిపించాడు.
Telangana Cabinet: హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలివే..
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి.. బంగ్లాదేశ్‌తో భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్ల నష్టానికి 81 పరుగుల వద్ద 308 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. రోజు ఆట ముగిసే సమయానికి శుభ్‌మన్ గిల్ 33 పరుగులతో క్రీజులో ఉండగా, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు, మూడో సెషన్ ప్రారంభంలో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌ను 149 పరుగులకు భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 227 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 376 పరుగుల వద్ద ముగిసింది.
Rohit Sharma and Kettleborough's reaction to Virat Kohli not reviewing even after the edge. 🥲💔 pic.twitter.com/O9tK060MyD
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 20, 2024