విశాఖలో ఆంధ్రాయూనివర్సిటీ (ఏయూ) మాజీ రెక్టార్ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ 90 వసంతాల వేడుక నిర్వహించారు. అంకోసా హాలులో ‘నవతీ ప్రసన్నం’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, విశిష్ఠ అతిథిగా మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సెంటర్ ఫర్ పాలసీ వ్యవస్థాపకులుగా, ఏయూ రెక్టార్గా, క్రికెట్, టెన్నిస్ వ్యాఖ్యాతగా ప్రొఫెసర్ ప్రసన్న కుమార్ సేవలు ప్రశంసనీయం అని అన్నారు. ఎంత కాలం బ్రతికాం అని కాదు.. ఎలా బ్రతికాం అనేది ముఖ్యం అని వెంకయ్య నాయుడు తెలిపారు. ఆనందకర జీవితం అందరూ కోరుకుంటారు.. దానిని సాధ్యం చేసుకోవడం గొప్పదని సూచించారు. వ్యక్తి ఆలోచనకు సానుకూల ధోరణి అవసరం.. యువకులు ప్రకృతితో కలిసి జీవించాలి, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని అన్నారు. మరణించిన తరువాత జీవించాలి అంటే సేవా కార్యక్రమాలు అలవాటు చేసుకోవాలి.. విశాఖలో తెన్నేటి విశ్వనాథం పరిచయంతో తన జీవిన శైలి మారిందని తెలిపారు. విశాఖలో ప్రముఖులు వల్ల తన జీవితంలో ఉన్నత శిఖరాలకు చూడగలిగానని అన్నారు.
Read Also: Nimmala ramanaidu: టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసింది..
మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ.. ఆచార్య ప్రసన్న కుమార్ ఆంగ్ల ఉపన్యాసం ఆసక్తికరంగా ఉండేది.. వెంకయ్య నాయుడుకి, ప్రసన్న కుమార్‌కి పోలిక ఉందని అన్నారు. ఇద్దరు విద్యార్థి సంఘాల నాయకులుగా గెలిచారు.. ప్రసన్న కుమార్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో డాల్ఫీన్ డైరీస్ కథనాలు రాశారన్నారు. మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యం మాట్లాడుతూ.. మంచి ఎడ్యుకేషన్ పాలసీ తీసుకువచ్చారు.. ఎడ్యుకేషన్ పాలసీ పై శ్రద్ధ ప్రభుత్వ స్థాయిలలో కనిపించడం లేదని తెలిపారు. ఉప కులపతి అంటే ఒక కులం వారినే వేయాలని అనుకుంటున్నారు.. మేధావులను, విజ్ఞాన ప్రముఖులను విశ్వ విద్యాలయ ఉప కులపతులు ఐతే విశ్వ విద్యాలయాలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Vijayawada: ఇద్దరు పిల్లలతో కలిసి కాల్వలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం..