భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కొత్త రిటెన్షన్ నిబంధనను రూపొందించింది. అక్టోబర్ 31 లోపు అన్ని ఫ్రాంచైజీలు రిటైన్ చేయబడిన ఆటగాళ్ల జాబితాను సమర్పించాలని కోరింది. ఐపీఎల్ 2025 కోసం బీసీసీఐ అనేక కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. ఈసారి మెగా వేలం చాలా ఆసక్తికరంగా ఉండనుంది. తదుపరి సీజన్ కోసం మెగా వేలానికి ముందు.. టీమిండియా మాజీ క్రికెటర్ ఆర్పీ సింగ్ ఆర్సీబీకి సలహా ఇచ్చాడు. ఆర్సీబీ విరాట్ కోహ్లీని రిటైన్ చేసుకుని.. మిగిలిన వారిని విడుదల చేయమని చెప్పాడు.
ఐపీఎల్ కొత్త రిటెన్షన్ నియమాల ప్రకారం.. ప్రతి జట్టుకు 6 మంది ఆటగాళ్లను రిటైన్ చేయడానికి లేదా ఆర్టీఎం ఉపయోగించి ఆటగాళ్లను తిరిగి తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఐపీఎల్ 2024లో కోహ్లి ఆర్సీబీకి స్టార్ ప్లేయర్‌గా నిరూపించుకున్నాడు. జట్టును ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా.. అద్భుత బ్యాటింగ్‌తో కోహ్లీ ఆరెంజ్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు. 15 మ్యాచ్‌ల్లో 741 పరుగులు చేశాడు. కలర్స్ సినీప్లెక్స్‌తో ఆర్పీ సింగ్ మాట్లాడుతూ, కోహ్లీ జట్టుతోనే ఉండాలని.. మహ్మద్ సిరాజ్, రజత్ పాటిదార్ వంటి ఇతర ఆటగాళ్లను ఆర్‌టిఎమ్ కార్డ్ ఉపయోగించి వేలంలో తిరిగి తీసుకురావచ్చని ఆర్పీ సింగ్ తెలిపారు.
వేలంలో సిరాజ్, రజత్ పటిదర్ రూ.11 కోట్లకు మించి పొందలేరని మాజీ ఫాస్ట్ బౌలర్ ఆర్పీ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఇందులో ఆర్సీబీకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని భావిస్తున్నాను అని చెప్పాడు. ఆర్సీబీ కోహ్లీని మాత్రమే ఉంచుకుని మిగతా అందరినీ విడుదల చేసి ఆర్టీఎంని ఉపయోగించాలని కోరాడు. రజత్ పాటిదార్‌ను వదిలేస్తే వేలంలో తక్కువ ధరకు పొందగలమని తాను భావిస్తున్నానని అన్నాడు. కాబట్టి వారిని వేలంలో తిరిగి కొనుగోలు చేయవచ్చని ఆర్పీ సింగ్ తెలిపాడు.
సిరాజ్ వేలంలో రూ.11 కోట్లకు చేరువగా వస్తాడా లేదా అన్నది చూడాలి అని ఆర్సీబీ సింగ్ అన్నాడు. సిరాజ్ 14 కోట్ల రూపాయలకు చేరుకోవడం కష్టమే.. కావున ఆర్సీబీ ఆర్టీఎంని ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని చెప్పాడు. ఇక ఆర్సీబీ కొత్త మనస్తత్వంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్సీబీకి విరాట్ కోహ్లీ అవసరం.. ఎందుకంటే అతను జట్టు కోసం చాలా చేశాడు. విరాట్ చాలా ముఖ్యమైన ఆటగాడు. కోహ్లీ చుట్టూ జట్టును నిర్మించడం గురించి ఆర్సీబీ ఆలోచించాలని పేర్కొన్నాడు. ఆర్సీబీలో కోహ్లి తప్పా.. మరే ఇతర ఆటగాడు రూ.18 లేదా రూ.14 కోట్లుగా కనిపించడం లేదని చెప్పాడు.
Udhayanidhi Stalin: డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్..మంత్రి వర్గంలో మరో నలుగురికి చోటు