ఐపీఎల్ వేలం చరిత్రలో కొంత మంది ఆటగాళ్లు కోట్లు కొల్లగొట్టారు. గత వేలం కంటే.. ఈసారి వేలంలో రికార్డులు బద్దలైంది. ఐపీఎల్‌లో ఇండియన్ బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తుండటంతో.. తాజాగా జరిగిన మెగా వేలంలో భారత్ ఆటగాళ్లు రికార్డు ధర పలికారు. ఐపీఎల్ 2024 సీజన్ వరకు టాప్ 10 ఆటగాళ్లలో కేవలం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే భారతీయులు ఉండేది. కానీ ఇప్పుడు ఈ జాబితాలో మరో ఐదుగురు ఆటగాళ్లు చేరారు. అంతే కాకుండా.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో భారత్ ఆటగాళ్లే ఉన్నారు.
Fire Accident : జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం… పరిసర ప్రాంతాల్లో దట్టంగా కమ్ముకున్న పొగ
ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో రిషబ్ పంత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత.. వేలంలో రూ.25 కోట్ల బిడ్ దాటిన మొదటి వ్యక్తి శ్రేయాస్ అయ్యర్ ఉన్నాడు. ఈ సీజన్‌లో అతడిని పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో.. శ్రేయాస్ రెండో స్థానంలో ఉన్నాడు. గత సీజన్‌లో రూ. 24.75 కోట్లకు అమ్ముడైన మిచెల్ స్టార్క్.. 2024 వరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతను మూడవ స్థానంలో ఉన్నాడు.
IPL Auction 2025: మెగా వేలం తర్వాత ఏ టీమ్ బలంగా, బలహీనంగా ఉంది..!
ఈ జాబితాలో నాలుగో పేరు వెంకటేష్ అయ్యర్. ఈ భారత ఆల్‌రౌండర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ ఈసారి రూ. 23.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఐదవ స్థానంలో పాట్ కమ్మిన్స్ ఉన్నాడు. గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. 2023లో పంజాబ్ కింగ్స్ రూ. 18.5 కోట్లకు కొనుగోలు చేసిన సామ్ కుర్రాన్ ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ ఇద్దరు ఆటగాళ్లను రూ.18-18 కోట్లకు కొనుగోలు చేసింది. వారిలో ఒకరు అర్ష్‌దీప్ సింగ్ కాగా.. మరొకరు యుజ్వేంద్ర చాహల్ వరుసగా 7, 8 స్థానాల్లో ఉన్నారు. కామెరాన్ గ్రీన్ రూ. 17.50 కోట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. చివరగా బెన్ స్టోక్స్ ఉన్నాడు. అతనిని 2023లో రూ. 16.25 కోట్లకుచెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
ఐపీఎల్ వేలంలో విక్రయించబడిన అత్యంత ఖరీదైన ఆటగాళ్ల జాబితా:
1. రిషబ్ పంత్ – రూ. 27 కోట్లు – లక్నో సూపర్ జెయింట్స్ – 2025
2. శ్రేయాస్ అయ్యర్ – 26.75 కోట్లు – పంజాబ్ కింగ్స్ – 2025
3. మిచెల్ స్టార్క్ – రూ. 24.75 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్ – 2024
4. వెంకటేష్ అయ్యర్ – రూ 23.75 కోట్లు – కోల్‌కతా నైట్ రైడర్స్ – 2025
5. పాట్ కమిన్స్ – 20.50 కోట్లు – సన్‌రైజర్స్ హైదరాబాద్ – 2024
6. సామ్ కర్రాన్ – 18.50 కోట్లు – పంజాబ్ కింగ్స్ – 2023
7. అర్ష్‌దీప్ సింగ్ – 18 కోట్లు – పంజాబ్ కింగ్స్ – 2025
8. యుజ్వేంద్ర చాహల్ – 18 కోట్లు – పంజాబ్ కింగ్స్ – 2025
9. కామెరాన్ గ్రీన్ – రూ. 17.50 కోట్లు – ముంబై ఇండియన్స్ – 2023
10. బెన్ స్టోక్స్ – 16.25 కోట్లు – చెన్నై సూపర్ కింగ్స్ – 2023