ఐపీఎల్ 2025 వేలంలో 10 ఫ్రాంచైజీలు మొత్తం 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఐపీఎల్ వేలంలో రిషబ్ పంత్‌పై భారీ ధర పలికింది. లక్నో సూపర్ జెయింట్స్ రిషబ్ పంత్‌ను రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ విధంగా ఐపీఎల్ 2025 వేలంలో భారీ ధరకు అమ్ముడైన క్రికెటర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. మరోవైపు.. పిన్న వయస్సు ఉన్న ఆటగాళ్లను ఈ వేలంలో కొనుగోలు చేశారు. అత్యంత పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. అతనితో పాటు మరికొంత మంది పిన్న వయస్కులు ఐపీఎల్‌లో కనిపించనున్నారు.
Read Also: Health Benefits: ఖాళీ కడుపుతో ఈ ఆకులను తింటే ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు..
ఐపీఎల్ మెగా వేలంలో అమ్ముడైన యువ క్రికెటర్లు:
వైభవ్ సూర్యవంశీ (13 సంవత్సరాల 244 రోజులు):
ఐపీఎల్ మెగా వేలం 2025లో అమ్ముడైన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. అతని వయస్సు కేవలం 13 సంవత్సరాలు. వైభవ్ 2011 మార్చి 27న బీహార్‌లోని సమస్తిపూర్‌లో జన్మించాడు. ఈ మెగా వేలంలో వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 1.10 కోట్లకు కొనుగోలు చేసింది. అతను రూ. 30 లక్షల బేస్ ధరతో వేలంలోకి వచ్చాడు. ఇతని కోసం రాజస్థాన్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిడ్డింగ్ వార్ జరిగింది.
ఆండ్రీ సిద్దార్థ్ (18 ఏళ్ల 90 రోజులు):
అన్‌క్యాప్డ్ ప్లేయర్ ఆండ్రీ సిద్ధార్థ్ 2006 ఆగస్టు 28న జన్మించాడు. ఐపీఎల్ వేలం 2025లో అమ్ముడైన రెండవ అతి పిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు. ఆండ్రీ సిద్ధార్థ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ అతని ప్రాథమిక ధర రూ. 30 లక్షలకు కొనుగోలు చేసింది.
క్వేనా మఫాకా (18 సంవత్సరాల 232 రోజులు):
ఐపీఎల్ 2025 వేలంలో దక్షిణాఫ్రికా యువ ఫాస్ట్ బౌలర్ క్వేనా మఫాకాను రాజస్థాన్ రాయల్స్ రూ. 1.50 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో అతను ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. అయితే వేలానికి ముందు ముంబై ఇండియన్స్ అతనిని రిలీజ్ చేసింది. దీంతో.. రూ.75 లక్షల బేస్ ధరతో వేలంలోకి రాగా, క్వెనాను రూ.1.50 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
అల్లా గజన్‌ఫర్ (18 సంవత్సరాల 251 రోజులు):
ఐపీఎల్ 2025 వేలంలో ఆఫ్ఘన్ స్పిన్నర్ అల్లా ఘజన్‌ఫర్‌ను ముంబై ఇండియన్స్ రూ. 4.8 కోట్లకు కొనుగోలు చేసింది. అల్లా గజన్‌ఫర్ రూ. 75 లక్షల బేస్ ధరతో వేలంలోకి అడుగుపెట్టగా.. అతడిని కొనుగోలు చేసేందుకు 4 ఫ్రాంచైజీల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. అల్లా గజన్‌ఫర్ 2006 మార్చి 18న జన్మించాడు. అతడిని కొనుగోలు చేసేందుకు ఆర్‌ఎస్‌బీ ఫ్రాంచైజీ కూడా వేలంలో ఆసక్తి చూపింది.
నూర్ అహ్మద్ (19 సంవత్సరాల 328 రోజులు):
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ నూర్ అహ్మద్ 2005 జనవరి 3న జన్మించాడు. ఐపీఎల్ 2025 వేలంలో 10 కోట్ల రూపాయలకు సీఎస్కే అతన్ని కొనుగోలు చేసింది. వేలంలో అతనిని కొనుగోలు చేసేందుకు గుజరాత్ టైటాన్స్ ఆర్టీఎంను ఉపయోగించాలని భావించింది, కానీ చివరికి చెన్నై అతన్ని కొనుగోలు చేసింది. ముంబై ఇండియన్స్ కూడా నూర్ అహ్మద్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపింది.