Anirudh Wedding: అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి వార్తల్లో నిజమెంత? ‘జైలర్ 2’ తర్వాత పెళ్లి అంటూ జోరుగా ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anirudh Wedding: దక్షిణాది స్టార్ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, ప్రముఖ వ్యాపారవేత్త కావ్య మారన్ మధ్య డేటింగ్ జరుగుతోందన్న వార్తలు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ ప్రచారం మరో మెట్టు ఎక్కింది. రజనీకాంత్ నటిస్తున్న ‘జైలర్ 2’ సినిమా విడుదల అనంతరం ఈ ఇద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ 2026 నవంబర్ రెండో వారంలో వివాహం చేసుకునే అవకాశముందని తమిళ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. 2026 అక్టోబర్ 15న విడుదల కానున్న రజనీకాంత్ చిత్రం ‘జైలర్ 2’ విడుదల తర్వాత వీరి పెళ్లి జరగవచ్చని తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ సమాచారం ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించబడలేదు.
ఇప్పటి వరకు ఈ వార్తలపై అనిరుధ్ రవిచందర్ గానీ, కావ్య మారన్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ వార్తలు ప్రస్తుతం పూర్తిగా ఊహాగానాలుగానే ఉన్నాయి. గతంలో కూడా వీరిద్దరి డేటింగ్‌పై అనేక కథనాలు వచ్చినప్పటికీ, వాటిపై ఎప్పుడూ అధికారిక స్పందన రాలేదు. అయితే ఈసారి ప్రచారానికి మరింత బలం చేకూర్చిన అంశం అనిరుధ్ కుటుంబం నుంచి వచ్చిన వ్యాఖ్యలే. కొద్ది రోజుల క్రితం అనిరుధ్ మామ, ప్రముఖ నటుడు వైజీ మహేంద్రన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అనిరుధ్ వివాహం త్వరలోనే జరుగుతుందని పేర్కొన్నారు. అయితే వధువు ఎవరు అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. దీంతో కావ్య మారన్ పేరే మరోసారి ప్రధానంగా వినిపిస్తోంది.
Also Read
- Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
- Quick Style: హైదరాబాద్‌కు వరల్డ్ ఫేమస్ డ్యాన్స్ ట్రూప్.. నవంబర్ 1న అదిరిపోయే డ్యాన్స్ షో!
- Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
- Scene: పోలీస్ ఆఫీసర్‌గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో 'సీన్' ఎలా ఉండబోతోందంటే?
కావ్య మారన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సన్ గ్రూప్ ఛైర్మన్ కలానిధి మారన్ కుమార్తె అయిన ఆమె, ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియంలో కనిపించే ఆమెకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. వ్యాపార రంగంలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్ కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తలపతి విజయ్ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతున్న ‘జన నాయగన్’కు సంగీతం అందిస్తున్నారు. హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, మమితా బైజు, నరైన్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అంతేకాకుండా ‘డీసీ’, ‘జైలర్ 2’, ‘ది ప్యారడైజ్’, ‘అరసన్’, ‘కింగ్’ వంటి భారీ చిత్రాలు కూడా అనిరుధ్ చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు కూడా అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం అనిరుధ్, కావ్య మారన్ వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో, ఈ వార్తలను ప్రస్తుతం ప్రచారంగా మాత్రమే చూడాల్సిన అవసరం ఉంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు ఈ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
- Tags
- cinema
తాజావార్తలు
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Ibrahim Zadran: మేము బాగా ఆడాం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. అఫ్గాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!