Snakranthi Fight : అనిల్ రావిపూడికి పోటీగా పొంగల్ రేస్ లో ‘వీరాధి వీరులు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో సంక్రాంతి పండగ సీజన్ అంటే బాక్సాఫీస్ వద్ద ఎంతటి భారీ పోటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అగ్ర నిర్మాతలు, స్టార్ డైరెక్టర్ల మధ్య థియేటర్ల వేటలో అప్పుడప్పుడు చిన్నపాటి క్లాష్ లు సహజం. ఇప్పుడు అలాంటి పోటీ మరోటి ఉండబోతుంది. ఇప్పటికే ఈ రేస్ లో అనిల్ రవిపూడి – వెంకీ – కళ్యాణ్ రామ్ సినిమా ఉంది. తాజాగా మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు కాంబినేషన్లో హసిత్ గోలి దర్శకత్వంలో తాము నిర్మించబోయే క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని 2027 సంక్రాంతి రేసులో నిలుపుతున్నారట. ఈ విషయాన్నీ ఆప్తమిత్రుడు, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి వారు ముందే తెలియజేసినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది.
దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో అనిల్ రావిపూడి వరుసగా సూపర్ హిట్ సినిమాలు చేస్తూ ఆ సంస్థకు అత్యంత సన్నిహితుడిగా మారారు. వచ్చే సంక్రాంతి రేసులో అనిల్ రావిపూడి సినిమా కూడా ఉండటంతో, బాక్సాఫీస్ క్లాష్ వల్ల తమ మధ్య ఉన్న సత్సంబంధాలు ఎక్కడ దెబ్బతింటాయోనని నిర్మాతలు శిరీష్, రాజు తమ సినిమా పండగ రిలీజ్ ప్లానింగ్‌ను అనిల్ రావిపూడికి ముందుగానే చెప్పి చర్చించారట. దీనివల్ల ఇండస్ట్రీలో ఎలాంటి అపార్థాలకు తావులేకుండా అలా చేశారట. రవితేజ మాస్ ఎనర్జీ, శ్రీవిష్ణు మార్క్ కామెడీ టైమింగ్ కలగలిపి దర్శకుడు హసిత్ గోలి ఒక హిలేరియస్ వినోదాత్మక కథను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి ‘వీరాధి వీరులంట’ అనే క్రేజీ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను 2027 సంక్రాంతి కానుకగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు. పండగ సీజన్లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించడమే లక్ష్యంగా దిల్ రాజు టీమ్ శరవేగంగా అడుగులు వేస్తోంది.
Also Read
- Scene Movie: "హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది": సూర్య
- Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
- Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
- Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!