Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప2 ఊరమాస్ హిట్ తర్వాత.. జవాన్‌తో బాలీవుడ్ బాద్ షాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీతో జతయ్యాడు బన్నీ. అట్లీ నెరేషన్‌కు పడిపోయిన ఐకాన్ స్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం.. ఎనౌన్స్ మెంట్ వీడియో రిలీజ్ చేయడం చకా చకా జరిగిపోయాయి. ఇక ఈ ఏడాది బన్నీ బర్తే డే సందర్భంగా రాకా మూవీ టైటిల్ రివీల్ చేసింది టీం. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పట్లేదు అట్లీ అండ్ బన్నీ.
అట్లీ ఈ సినిమాను చాలా ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్‌గా తీసుకుంటున్నాడు. పారలల్ యూనివర్స్ నేపథ్యంలో సాగే సైన్స్-ఫిక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాడు. రాకా కోసం సుమారు రూ. 800-1000 కోట్ల వరకు నిర్మాతలు బడ్జెట్ కేటాయిస్తున్నారని సమాచారం. విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తోన్న ఈ సినిమా రిలీజ్ డేట్ అట్లీ చెప్పకపోయినా.. 2027లో పుష్పరాజ్ వస్తాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ నెక్ట్స్ ఇయర్ కూడా రాక రావడం కష్టమేనన్నది ప్రజెంట్ టాక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రాకాను ఇంటర్నేషల్ స్టాండర్స్‌కు తగ్గట్టుగా సినిమాను చెక్కుతున్నాడు అట్లీ. దీని కోసం ఎక్కడా రాజీ పడటం లేదట. టైం తీసుకోనైనా సరే వర్త్ బుల్ ఫిల్మ్ ఇవ్వాలన్న కసితో పనిచేస్తున్నాడని బజ్. ఇక విజువల్ వండర్ కోసం వీఎఫ్ఎక్స్, సీజీఐ టీంకి కావాల్సిన టైం ఇస్తున్నాడట. అందులో దీపికా ప్రజెంట్ ప్రెగ్నెన్నీ వల్ల ఆమె షూట్ కొంత పెండింగ్ పడిందని సమాచారం. ఈ కారణాలే సినిమాలు మరింత డిలే చేస్తున్నాయి. అందుకే రిలీజ్ డేట్ చెప్పకుండా దాటేస్తున్నాడు అట్లీ. 2028లో రాకా థియేటర్స్‌లోకి రావొచ్చని బజ్. ఇక బన్నీ, లోకీ మూవీని అక్టోబర్ నుండి పట్టాలెక్కించబోతున్నాడని టాక్.
Also Read
తాజావార్తలు
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
-
US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
-
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!