పక్కాగా ప్లాన్ చేసి చంపేసి…మిస్ ఫైర్ అన్నాడు.. చివరికి దొరికేసిన హోంగార్డు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పక్కా ప్లాన్‌తో భార్యను హత్య చేశాడు భర్త. హత్యను మిస్ ఫైర్‌గా చిత్రీకరించబోయే అడ్డంగా దొరికిపోయాడు. బెజవాడ మిస్ ఫైర్ ఘటనలో అసలు నిజాలు బయటకు వచ్చాయి. భార్య రత్న ప్రభను హోంగార్డ్ వినోద్ ఉద్దేశపూర్వకంగానే కాల్చి చంపాడని పోలీసులు గుర్తించారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వినోద్, రత్న ప్రభ కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించే విషయంలో భార్యాభర్తలిద్దరూ గొడవ పడ్డారు. ఈ ఘర్షణ సమయంలో వినోద్ తన దగ్గర ఉన్న తుపాకితో కాల్చి చంపాడని తెలుస్తోంది. మొదట తుపాకి మిస్ ఫైర్ అయి తన భార్య చనిపోయిందని డ్రామాలాడాడు వినోద్. అర్దరాత్రి ఈ ఘటన జరగడం తో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించి నిజాలు కక్కించారు. బంగారు నగలు తాకట్టు విషయంలో గొడవ జరిగి హోమ్ గార్డ్ వినోద్ ..భార్య పై ఫైర్ చేయడం వల్ల ఆమె చనిపోయిందని విజయవాడ సీఎపీ బత్తిన శ్రీనివాసులు అన్నారు. రెండు నెలలుగా వీరి మధ్య గొడవ జరుగుతుందని, తాకట్టు పెట్టిన ఆ నగలు విడిపించమని ఒత్తిడి చేసిందన్నారాయన. హోంగార్డ్ మీద ప్రస్తుతం మర్డర్ కేసు కట్టామని, విచారణ జరుగుతుందని చెప్పారు సీపీ.
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Tags
- andhra
- gun fire
- vijayawada
తాజావార్తలు
-
Fauji vs Spirit: రిలీజ్ ప్లాన్‌లో మార్పులు.. ‘ఫౌజీ’ కంటే ముందే ‘స్పిరిట్’?
-
Virat Kohli: ఇక విరాట్ కోహ్లీని ఎవరూ టచ్ చేయలేరు: కైఫ్
-
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
-
Gyanesh Kumar: సీఈసీ జ్ఞానేష్ కుమార్ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. మరోసారి విపక్షాల భారీ ప్లాన్..!
-
YS Jagan: నేడు ఒంగోలుకు వైఎస్ జగన్.. కాకుమాను రాజశేఖర్ కుటుంబానికి పరామర్శ
ట్రెండింగ్
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
-
Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!