యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ప్రఖ్యాత భవనాలపై భారత త్రివర్ణ పతాకం మెరిసింది. ఇండియాలో కోవిడ్ -19 కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశానికి సంఘీభావంగా యూఏఈలోని పలు ప్రసిద్ధ భవనాలపై ఆదివారం భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా, అబుదాబిలోని అడ్నోక్ ప్రధాన కార్యాలయాలు భారత జెండాతో వెలిగిపోయాయి. ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అంటూ అక్కడ ప్రదర్శించిన భారత త్రివర్ణ పతాకం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఇండియా ఇన్ యూఏఈ’ […]
దర్శకేంద్రుడు ఇటీవలే పెళ్లిసందడి చిత్రానికి సీక్వెల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘పెళ్లి సందD’ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించడం లేదు. కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే చేపట్టనున్నారు. అంతేకాదు ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాను కొత్త దర్శకురాలు గౌరి రోనక్ చిత్రీకరించనున్నారు. హీరో రోషన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ఇక […]
93వ అకాడమీ అవార్డులలో డైరెక్ట్ గా భారతీయ చిత్రాలకు అవార్డులు రాకపోయినా, బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ గా ఎంపికైన ‘మై ఆక్టోపస్ టీచర్’కు ఇండియాతో సంబంధం ఉంది. ఇండియన్ ఫిల్మ్ మేకర్ స్వాతి త్యాగరాజన్ ఈ చిత్రానికి అసోసియేట్ ప్రొడ్యూసర్ గానూ, ప్రొడక్షన్ మేనేజర్ గానూ వ్యవహరించారు. ఈ నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ డాక్యుమెంటరీని పిప్పా ఎర్లిచ్, జేమ్స్ రీడ్ దర్శకత్వంలో క్రెయిగ్ ఫోస్టర్ నిర్మించారు. ఫోస్టర్ భార్య అయిన స్వాతి ఈ చిత్ర నిర్మాణంలో […]
ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘క్రాక్’ మూవీలో కఠారి శ్రీనుగా నటించి, ఆకట్టుకున్నాడు సముతిరకని. బేసికల్ గా చక్కని రచయిత, దర్శకుడు అయిన సముతిరకని కొంతకాలంగా అర్థవంతమైన పాత్రలూ పోషిస్తున్నారు. తెలుగులోనూ రెండు మూడు చిత్రాలను డైరెక్ట్ చేసిన సముతిరకని, ‘అల వైకుంఠపురములో’ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా నటించాడు. ప్రస్తుతం ఆయన ‘ట్రిపుల్ ఆర్’తో పాటు ‘ఆకాశవాణి’లో చంద్రమాస్టారు పాత్ర పోషిస్తున్నాడు. అలానే హర్ష పులిపాక దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘పంచతంత్రం’లో రామనాథం అనే […]
బెస్ట్ ఎడిటర్ గా నేషనల్ అవార్డును అందుకున్న వామన్ భోంస్లే (87) అనారోగ్యంతో గోరేగావ్ లో కన్నుమూశారు. 25వ జాతీయ చలన చిత్ర అవార్డులలో ‘ఇన్ కార్’ చిత్రానికి గానూ ఆయన ఉత్తమ కూర్పరిగా అవార్డును అందుకున్నారు. వయోభారం కారణంగా ఏర్పడిన ఆరోగ్య సమస్యలతో వామన్ భోంస్లే ఈ రోజు తెల్లవారుఝామున తన ఇంటిలోనే కన్నుమూశారు. గత యేడాది లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైపోయిన వామన్ భోంస్లే జ్ఞాపకశక్తినీ కోల్పోయారు. 2000 సంవత్సరంలో ఆయన ఎడిటింగ్ […]
గత కొన్ని సంవత్సరాలుగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ (ఎఫ్.సి.ఎ) సభ్యులు ఎవరైనా మరణిస్తే, వారి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 25 వేలను అసోసియేషన్ అందిస్తోంది. అందులో భాగంగా, ఇటీవల అనారోగ్యంగా కన్నుమూసిన ఎఫ్.సి.ఎ. సీనియర్ సభ్యులు, మ్యూజికాలజిస్ట్ స్వర్గీయ రాజా కుటుంబాన్ని కలిసి, పరామర్శించి రూ. 25 వేల చెక్కుని అందచేసింది. ఆదివారం స్వర్గీయ రాజా భార్య ఎం. పద్మావతిని కలిసి ‘రాజా గారి మరణం జర్నలిస్టు కుటుంబానికే కాకుండా సినీ సంగీత కుటుంబానికీ తీరని […]
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సుల్తాన్’. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుల్తాన్’కు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రభు ఈ మూవీని నిర్మించారు. ప్రేక్షకుల నుంచి విభిన్న రెస్పాన్స్ ను రాబట్టుకున్న ‘సుల్తాన్’ చిత్రం ఏప్రిల్ 30న తెలుగు ఓటిటి వేదిక […]
యంగ్ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. పెగళ్ళపాటి కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించాడు. భారీ అంచనాలతో మార్చి 19న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించిన ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది. కార్తికేయ కెరీర్ లో మరో భారీ ప్లాప్ గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఓటిటిలో విడుదలై రికార్డులు సృష్టిస్తోంది. ఏప్రిల్ 23న ప్రముఖ ఓటిటి సంస్థ ‘ఆహా’లో విడుదలైంది ‘చావు కబురు […]
‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం, ఇష్క్’ బాటలోనే ‘ఏక్ మినీ కథ’ కూడా సాగిపోతోంది. ఈ నెలాఖరుకు సినిమాను విడుదల చేయడం లేదంటూ హీరో సంతోష్ శోభన్ తో ఓ ఫన్నీ వీడియో ద్వారా తెలియచేశారు చిత్ర నిర్మాతలు. యూవీ కాన్సెప్ట్స్, మ్యాంగో మాస్ మీడియా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాతో కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రముఖ దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి కథను అందించడం విశేషం. డస్ సైజ్ […]
ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ఫస్ట్ కొలాబరేషన్ మూవీ షూటింగ్ ఏప్రిల్ 15న మొదలు కావాల్సింది. కానీ కత్రినా కు కొవిడ్ 19 పాజిటివ్ రావడంతో అది కాస్తా పోస్ట్ పోన్ అయ్యింది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో రమేశ్ తురానీ దీనిని నిర్మిస్తున్నాడు. అంతేకాకుండా ఇవాళ దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాల్చడంతో ఏ ప్రాజెక్ట్స్ ఎప్పుడు మొదలవుతుందో తెలియని అనిశ్చిత పరిస్థితి నెలకొంది. కత్రినాతో సినిమా తిరిగి ఎప్పుడు మొదలవుతుందో […]