కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, క్యూట్ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సుల్తాన్’. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందనే వచ్చింది. కన్నన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుల్తాన్’కు వివేక్ మెర్విన్ సంగీతం అందించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రభు ఈ మూవీని నిర్మించారు. ప్రేక్షకుల నుంచి విభిన్న రెస్పాన్స్ ను రాబట్టుకున్న ‘సుల్తాన్’ చిత్రం ఏప్రిల్ 30న తెలుగు ఓటిటి వేదిక ‘ఆహా’లో ప్రీమియర్ కానుంది. రౌడీలను రైతులుగా మార్చిన యువకుడు ఓ గ్రామాన్ని విలన్ల నుంచి ఎలా కాపాడాడు ? కాపాడే క్రమంలో ఆ యువకుడికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాడు ? అన్నదే చిత్ర కథాంశం. ఈ చిత్రంలో నెపోలియన్, లాల్, యోగిబాబు, కేజీఎఫ్ గరుడ ముఖ్య పాత్రల్లో నటించారు.